ఏపీలో 44.71 లక్షల ఓట్ల ఔట్, చెక్ చేసుకోండి- మీ పేరు లేకుంటే ఇలా చేయండి..!!

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం 'అన్‌కలెక్టబుల్' (సేకరించలేనివి) వర్గంలో చేర్చింది. దీంతో, ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవటం తో పాటుగా ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది.

ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదని గుర్తించారు. ఈ నెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాలో ఈ 44.71 లక్షల ఓట్లు ఉండే అవకాశం లేదు.

Election commission Flags 44 71 Lakh AP Voter Entries for Deletion Apply Through Form-6 by August 30

సరైన ఆధారాలు లేకపోవడం, చిరునామాల మార్పు లేదా ఓటర్ల గైర్హాజరీ వంటి కారణాల వల్ల ఈ ఓట్లు తొలగింపునకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. చిరునామా మార్పులు, మరణాలు, డబుల్ ఎంట్రీలు, ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

అభ్యంతరాల కోసం గడువు

అయితే, ఇదే సమయంలో ఓటర్లకు ఎన్నికల సంఘం భరోసా ఇస్తోంది. ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు కలవరపడాల్సిన అవసరం లేదని, తమ ఓట్లను సరిచేసుకునేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30 నుండి ఆగస్టు 30 వరకు నెల రోజుల పాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఫారమ్-6 ద్వారా తెలిపేందుకు అవకాశం కల్పించారు.

తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడిందని భావించేవారు లేదా మార్పులు చేయాలనుకునేవారు ఈ వ్యవధిలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అందిన దరఖాస్తులపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అన్ని సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3న ఓటర్ల తుది (ఫైనల్) జాబితాను విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+