ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ మరో ట్విస్ట్..! ఫలితాల వేళ టెన్షన్ డబుల్..!

ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్దాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోలయ్యాయి. దీంతో అందరి దృష్టీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే పడింది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతిబింబంగా భావించే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి ఎక్కువగా పోలవడంతో అధికార పార్టీకి ఇది మైనస్ కాబోతోందన్న చర్చను విపక్షాలు తెరపైకి తెస్తున్నాయి. అదే సమయంలో ఈసీ పోస్టల్ బ్యాలెట్లపై జారీ చేస్తున్న మార్గదర్శకాలు అన్ని పార్టీల్లోనూ టెన్షన్ పెంచుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక సీల్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాలతో పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. సీల్ లేకపోయినా అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనుమతిస్తున్న ఈసీ.. ఏపీలో మాత్రం సీల్ ఉండాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో ఆ మేరకు ఓట్లు వేసిన ఉద్యోగుల్లో టెన్షన్ పెరుగుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఈ సీల్ లేకుండా పడిన ఓట్ల చెల్లుబాటుపై టెన్షన్ పడుతున్నాయి.

election commission new directive on validity of post ballot votes in ap

అదే సమయంలో ఈసీ తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై సీఈవోకి మరిన్ని కీలక ఆదేశాలు పంపింది. ఇందులో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపరు అనుమానాస్పద పేపర్‌గా గుర్తించినా, చిరిగిపోయినా చెల్లదని పేర్కొంది. బ్యాలెట్‌ అని నిర్ధారించడానికి అవకాశం లేని సమయంలో, రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన కవర్‌-బి లేకపోతే ఓటరు గుర్తించే విధంగా ఆ పత్రంపై ఏమైనా గుర్తులు, చేతిరాతలున్న సందర్భాల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ను తిరస్కరించాలని తెలిపింది.

అలాగే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ఓటేసే సమయంలో డిక్లరేషన్‌ ఫారం కవర్‌-బిలో లేకపోతే, డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ లేదా అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం లేకపోతే, ఫారం-13ఎ, ఫారం- 13బిలో బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్లు వేర్వేరుగా ఉన్నా బ్యాలెట్‌ తెరవకుండానే తిరస్కరించవచ్చని ఈసీ పేర్కొంది. డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఇవి ఉండి కూడా స్టాంపు లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. బ్యాలెట్ ధ్రువీకరణ అధికారి సంతకంపై అనుమానం వస్తే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద రిటర్నింగ్‌ అధికారి అటెస్టింగ్‌ ఆఫీసర్ల వివరాలతో పోల్చి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+