ఈవీఎంలపై వైసీపీ ఫిర్యాదు, విచారణ- కీలక మలుపు..!!

ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం..ఓట్ల లెక్కింపు పైన గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటీ ఈవీఎంల పైన ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌), వీఎఫ్‌ (ఓట్‌ ఫర్‌ డెమొక్రసీ) పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోనూ ఈ తరహా అనుమానాల పైన వైసీపీ నేతలు విచారణ కోరారు. ఇందుకు ముందుకు అధికారులు ముందుకు వచ్చారు. కానీ, తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈవీఎంల పై ఫిర్యాదులు
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పని తీరు పైన పలు సందేహాలు చర్చగా మారాయి. ఒంగోలులో రీ కౌంటింగ్ చేయాలంటూ వైసీపీ అభ్యర్ది బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు అవసరమైన ఫీజు చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు సమర్పించారు. దీనిపై విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్‌ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.

Election Commission reacts over Balineni Complaints over EVM s Votes counting complaint

వైసీపీ నేతలకు ఫోన్లు
మే 13న పోలింగ్‌ జరగగా, 21 రోజుల తర్వాత జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా, అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్‌ 99 శాతం ఉన్నట్టు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ గమనించి, అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్‌ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ స్వయంగా వెల్లడించారు.

ఏం తేలనుంది
ఇదే అంశం పైన బాలినేని స్పందించారు. తన పీఏకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. విచారణ జరగాల్సిందేనని, వాస్తవాలు నిగ్గుతేలాల్సిందేనని తాను చెప్పినట్టు ఆయన వివరించారు. ఈవీఎంలపై ఫిర్యాదుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు, రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాల పైచర్చ జరిగుతోంది. దీంతో, నిజంగా విచారణ జరుగుతుందా.. జరిగితే ఏం తేల్చుతారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+