స్థానిక సంస్థల ఎన్నికలు... ఈ నెల 28న అన్ని పార్టీలతో ఈసీ కీలక సమావేశం...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని కోరనున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది.
రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతోనూ దీనిపై చర్చించనున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ కారణంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఆ తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్‌ను ఏకంగా ఆ పదవి నుంచి తొలగించింది. అయితే దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసినప్పటికీ న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ దృష్టి సారించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications