కుప్పం, పుంగనూరులో హై అలర్ట్, అందరి కన్ను అక్కడే, రంగంలోకి కేంద్ర బలగాలు !

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో సోమవారం ఉదయం పోలింగ్ మొదలైయ్యింది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమీషన్ అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక నియోజక వర్గాలు, పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, పీలేరు, తంబళపల్లె అసెంబ్లీ నియోక వర్గాల్లో అదనపు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరి దృష్టి ఇప్పుడు కుప్పం, పుంగనూరు, తంబళపల్లె, పీలేరు మీద పడింది. అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు పుంగనూరు, కుప్పంపై ఎక్కువగా దృష్టి పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు, పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీలో ఉండటంతో ఆ నియోజక వర్గాలపై అధికారులు నిఘా పెట్టారు.

Election Commission with special focus on Kuppam and Punganur constituencies

కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం ఉండటంతో అధికారులు ఆ ప్రాంతంలో నిఘా వేశారు. 2021 నవంబర్ లో కుప్పంలో పురపాలక ( మునిసిపాలిటి) ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కుప్పంలో గెలవాలనే పట్టుదలతో వైసీపీ నాయకులు ఓటుకు రూ 5 వేలు ఇవ్వడమే కాకుండా తమిళనాడు, పుంగనూరు, తంబళపల్లె, మదనపల్లె నుంచి దొంగ ఓటర్లను రప్పించుకుని దొంగ ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిచారని టీడీపీ ఆరోపించింది..

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూడా కుప్పంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ప్రాంతాలకు వెలుతున్న అన్ని వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుప్పం ప్రాంతంలో నివాసం లేని వారు ఆ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.

కుప్పంలో దొంగ ఓట్లు పోల్ కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుప్పం సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక పుంగనూరు నియోజక వర్గంలో పరిస్థితులు చాలావేడివేడిగా ఉన్నాయి. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు పలువురి మీద దాడులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో కేంద్ర బలగాలు మొహరించాయి. మదనపల్లె, పలమనేరు, పీలేరు నియోజక వర్గాల నుంచి పుంగనూరులోకి వెలుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పుంగనూరు, చౌడేపల్లె. సదుం ప్రాంతాలకు చెందిన వేలాది మంది బెంగళూరులో నివాసం ఉంటూ ఓట్లు వెయ్యడానికి పుంగనూరుకు వచ్చారు. పుంగనూరు సమీపంలోని బోయకొండ పుణ్యక్షేత్రం ఉండటంతో కర్ణాటక భక్తులు గంగమ్మ దర్శనం కోసం ఆ ప్రాంతానికి వెలుతున్నారు. భక్తుల ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి పుంగనూరులో వచ్చి దొంగ ఓట్లు వెయ్యడానికి వస్తారని టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+