ఏపీలో పోలింగ్ తేదీలపై కీలక అప్డేట్ - పార్టీలు, అధికారులు అలర్ట్..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల నిర్వహణ తేదీలపై క్లారిటీ వస్తోంది. లోక్‌సభ తో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. ఎన్నికల తేదీ ల పై పార్టీలు..అధికార యంత్రాగానికి తాజా సంకేతాలు అందాయి. దీంతో, పార్టీల అధినేతలు అప్రమత్తం అవుతున్నారు. అధికార యంత్రాంగం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది. దీంతో, రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.
షెడ్యూల్ ఎప్పుడు
ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చని తెలిసింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబరు లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరిగే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. . 2019 లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి మార్చి 13 తరువాత షెడ్యూల్ విడుదల అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 20-25 మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలి విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఈ సారి మూడు లేదా నాలుగో విడతలో ఉండే అవకాశం ఉందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే విడత పోలింగ్ నిర్వహించాలని ఇప్పటికే అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పార్టీలు సమాయత్తం
ఇటు రాజకీయ పార్టీలు ఎన్నికలు సిద్దం అవుతున్నాయి. పొత్తుల లెక్కలు స్పష్టత వచ్చాయి. ఏపీలో రెండు కూటమలు - వైసీపీ మధ్య ప్రధాన పోటీగా కనిపిస్తోంది. త్రిముఖ పోరు జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్దులను దాదాపు ఖరారు చేసాయి. ఈ సారి గెలుపు ప్రతీ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..ఎన్నికలకు షెడ్యూల్ వస్తుండటంతో మరింత అప్రమత్తం అవుతున్నాయి. మేనిఫెస్టోల ప్రకటనకు రంగం సిద్దం చేస్తున్నాయి. అదే సమయంలో ప్రచారం ముమ్మరం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. ఇక..షెడ్యూల్ ప్రకటనతో కోడ్ అమల్లోకి రానుంది. దీంతో..ప్రభుత్వం ఈ లోగానే హామీలు, ఎన్నికల వరాల పై ఫోకస్ చేసింది.












Click it and Unblock the Notifications