ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల-మోడీ ప్లాన్ సక్సెస్..!
ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా..ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన మూడు సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఈసీ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలోని ఒక్కో స్ధానానికి కూడా ఈసీ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఈసీ తాజా షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఈ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికి నిర్వహించే ఉపఎన్నికల కోసం డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. డిసెంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

డిసెంబర్ 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం డిసెంబర్ 20న మూడు రాజ్యసభ సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 20 సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. గతంలో వైసీపీలో ఉన్న ముగ్గురు ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ఒత్తిడికి లొంగి రాజీనామాలు చేసారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వారి రాజీనామాల్ని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడం , ఇప్పుడు ఎన్నికలు జరగడం చూస్తుంటే కేంద్రం పాత్ర స్పష్టమవుతోంది. ఈ మూడు సీట్లను ఏపీలో కూటమి ప్రభుత్వం చేజిక్కించుకోవడం ఖాయం.












Click it and Unblock the Notifications