టీడీపీకి అనుకూలంగా ట్రెండ్.. బయటపెట్టిన వైసీపీ!
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ విధ్వంసానికి పాల్పడిందని, వీవీ ప్యాట్ ను ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీన్ని వైరల్ చేయాలంటూ వైసీపీ శ్రేణులను కోరారు.
25 స్లిప్పుల్లో 20 సైకిల్ కే
అయితే ఈ ఫొటోలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వీవీ ప్యాట్ ధ్వంసమై ఓటింగ్ స్లిప్పులు బయటపడగా దాదాపు 25 స్లిప్పులు అక్కడే ఉన్నాయి. అయితే అందులో 20 వరకు సైకిల్ గుర్తుతో ఉన్నాయి. కేవలం ఐదు మాత్రమే ఫ్యాన్ గుర్తుపై ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్న గ్రామంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

యాక్టివిస్టుపై గతంలో కేసులు
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో ఆ పార్టీ విధ్వంసానికి ఎందుకు దిగుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీది తప్పు అని చెప్పే క్రమంలో ఈ పోస్టు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పోస్టు పెట్టిన యాక్టివిస్ట్ పై గతంలో అనేక కేసులున్నాయి. కోర్టులో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. శిక్ష కూడా పడింది. అటువంటి వ్యక్తి పెట్టిన పోస్టును వైరల్ చేస్తే అలా చేసినవారే కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.
సంబరంగా టీడీపీ శ్రేణులు
అటువంటి వ్యక్తి ముందు వెనకా చూసుకోకుండా పోస్టులు పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. ఇటువంటి తరుణంలో వైసీపీ యాక్టివిస్టు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి వైరల్ చేయాలనుకున్నదాంట్లోనే పోలింగ్ సరళి టీడీపీకి అనుకూలంగా ఉందని అర్థమవుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications