వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల త‌రుముకొస్తున్నాయ్..! ఇంకా తేల‌ని రాధా రాజ‌కీయ భ‌విత‌..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఏపి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువౌతోంది. నేడో రేపో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో రాజ‌కీయ పార్టీ నేత‌లు త‌మ‌త‌మ రాజ‌కీయ భ‌విత‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాని బెజ‌వాడ‌లో ఆ నాయుకుడు మాత్రం ఇంకా ఏ పార్టీ నుండి పోటీ చేయాలా అనే సందిగ్దం నుండి బ‌య‌టకు రాలేక పోతున్నారు. విజ‌య‌వాడలో వంగ‌వీటి కుటుంబం గురించి ప్ర‌త్యేక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాపుల స‌హాయంతో వంగ‌వీటి రాధ రాజ‌కీయంగా ఎదిగారు. ఆయ‌న వార‌సుడిగా వంగ‌వీటి రాధ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. వైసీపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాద ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం టీడీపీలో చేరుతారా లేదా మ‌రో పార్టీ అనే విష‌యంలో ఆయ‌న ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

<strong>ఓట్ల చేర్పు,తీసివేత‌ల‌కు కొల‌మానం ఉందా..?కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!</strong>ఓట్ల చేర్పు,తీసివేత‌ల‌కు కొల‌మానం ఉందా..?కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!

వంగ‌వీటి రాధా పార్టీ చేరిక‌పై స‌స్పెన్స్..! ఏపార్టీలో చేర‌తార‌న్న అంశంపై ఉత్కంఠ‌..!!

వంగ‌వీటి రాధా పార్టీ చేరిక‌పై స‌స్పెన్స్..! ఏపార్టీలో చేర‌తార‌న్న అంశంపై ఉత్కంఠ‌..!!

రాధ పార్టీ వీడ‌టం ప‌ట్ల వైసీపీలో కొంత మంది నేత‌లు అధినేత పై అసంత్రుప్తితో ఉన్నార‌ట‌. రాధ పార్టీ నుంచి వెళ్లిపోవ‌డం వ‌ల్ల కాపు ఓట‌ర్లు దూర‌మైయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాట్టు తెలుస్తోంది. మ‌రో వైపు రాధాను జనసేనలోకి తీసుకోవడానికి కాపు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాధ వ‌స్తే కాపుల ఓట్లను ప్ర‌భావితం చేస్తార‌ని ప‌లువురు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి సూచించిన‌ట్టు ప‌మాచారం.

జ‌న‌సేన సీటుఇచ్చేందుకు సై..! ఆలోచిస్తున్న రాధా..!!

జ‌న‌సేన సీటుఇచ్చేందుకు సై..! ఆలోచిస్తున్న రాధా..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వంగ‌వీటి వ‌స్తే పార్టీలో చేర్చుకునేందుకు కొంత మంది సీనియ‌ర్ల స‌ల‌హా కూడా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా రాధ‌ను చేర్చుకోవ‌డం వ‌ల్ల గోదావ‌రి జిల్లాలో కూడా క‌లిసి వ‌స్తుంద‌ని ఆలోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కొంత మంది కాపులు ఇప్పుడు టీడిపికి దగ్గర కాలేక, జగన్ కి ఓటు వెయ్యలేకా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రాధా చేరిక‌తో మెజారిటి కాపుల మద్దత్తు జ‌న‌సేన‌కు ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

టీడిపి తో మంత‌నాలు..! ఎటూ తేల్చుకోలేక పోతున్న వంగ‌వీటి వార‌సుడు..!!

టీడిపి తో మంత‌నాలు..! ఎటూ తేల్చుకోలేక పోతున్న వంగ‌వీటి వార‌సుడు..!!

పవన్ కళ్యాణ్ ప్రభావం గోదావరి జిల్లాల్లో కాపుల మీద ప‌డే అవ‌కాశాలు లేక పోలేదు. అందుకోసం ఇటు టీడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు రాధా విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవకాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. దీనితో అక్కడ రాధను తెలుగుదేశం నుంచి నిలబెడితే త‌మ‌కు న్యాయం చేసార నే భావన కాపుల్లో రావడానికి ఆస్కారం ఉంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యూహాత్మ‌కంగా పావులు కదుపుతున్న‌ట్టు తెలుస్తోంది. నర్సాపురం లేదా ఆ జిల్లాల నుంచి ఒక పార్లమెంట్ సీటు రాధ‌కు ఆఫ‌ర్ చేసార‌ట‌. దీనికి లగ‌డ‌పాటి రాజ్‌గోపాల్ స్వ‌యంగా బాబు ఇచ్చిన ఆఫ‌ర్‌ను తీసుకొని వంగ‌వీటిని క‌లిసిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

పెద్ద‌ల స‌భ‌కు పంపించేందుకు బాబు రెడీ..! రెండు మూడు రోజుల్లో రాధా నిర్ణ‌యం..!!

పెద్ద‌ల స‌భ‌కు పంపించేందుకు బాబు రెడీ..! రెండు మూడు రోజుల్లో రాధా నిర్ణ‌యం..!!

ఎంపీ సీటు ఇచ్చేందుకు బాబు సిద్దంగా ఉన్నార‌ని, త‌ద్వారా ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ప‌ట్టు నిలుపుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ్‌గోపాల్ త‌న బేటిలో వంగ‌వీటికి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాని రాధ మాత్రం ఈ వ్య‌వ‌హారంపై త్వ‌ర‌లో నిర్ణ‌యిం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో త్వ‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాధ మీద అబిమానులు ఒత్తిడి పెంచుతుండ‌టంతో రెండు, మూడు రోజుల్లో రాధ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

English summary
With the help of Kapus, Vangaveeti Ranga politely became strong. His successor Vangveeti Ratha is currently in politics. He came out of the party after the consequences in the YCP. He came to the idea of ​​going to TDP or another party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X