నాటు బాంబును తినేందుకు ప్రయత్నించిన ఏనుగు: పేలడంతో మృతి(వీడియో)
చిత్తూరు: జిల్లాలోని ఎర్రవారిపాళెం మండలం పులుబోనువారిపల్లెలో సోమవారం నాటు బాంబు తిని ఓ ఏనుగు మృతి చెందింది. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు భారీగా సంచరిస్తుంటాయి.
రాత్రి సమయాల్లో అటవీ సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తూ పగటిపూట శేషాచలం అడవుల్లో సేదదీరుతున్నాయి. ఆదివారం రాత్రి మండలంలోని నెరబైలు పంచాయతీ పులుబోనువారిపల్లెకు సమీపంలోని ఓ మామిడితోటలోకి ఆరేళ్ల వయస్సుగల ఆడ ఏనుగు వచ్చింది.

అక్కడున్న ఓ నాటుబాంబును ఆహారం అని భావించి తినేందుకు ప్రయత్నించగా అది పేలింది. దీంతో నోటి భాగంలో తీవ్రగాయమై ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.
సోమవారం గుర్తించిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు వచ్చి ఏనుగు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మామిడితోటలోకి నాటుబాంబు అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications