పిచ్చాసుపత్రి నుండి రోగులు పరారీ, ఖురేషీకి భార్యతో నో
హైదరాబాద్: రాజధానిలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుండి సోమవారం రాత్రి పదకొండు మంది అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకున్నారు. పరారీ వెనుక ఖురేషీ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో తన భార్యతో ములాఖత్‌కు అనుమతి ఇవ్వలేదని ఖురేషీ పరారయ్యాడు. అతను ముంబైకి పారిపోతున్నట్లుగా అనుమానిస్తున్నారు.
పరారైన రోగులు వివిధ జైళ్ల నుండి వచ్చిన వారు అని వైద్యులు చెబుతున్నారు. వెనుక భాగం నుండి వారు పరారైనట్లు చెప్పారు. అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకొని పారిపోవడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారాన్ని అందించాయి. నగరమంతా రెడ్ అలర్డ్ ప్రకటించారు.

బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్ పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు. ఆసుపత్రిలోని మేల్ వార్డులో కొంతకాలంగా వారు చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో వార్డులోని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో గది గోడలను పగులగొట్టి పారిపోయారు.
గది వద్ద ఉన్న కాపలా గార్డులు ఆ శబ్దాలను గుర్తించినప్పటికీ ప్రమాదకరమైన ఖైదీలు కావడంతో ఆపలేకపోయారు. పోలీసులకు సమాచారం అందించలోగా వారు పారిపోయారు. పారిపోయిన వారిలో ఐదుగురు పట్టుబడ్డారు.
ఖురేషీ, జీవరత్నం, తిరుమలేష్, స్వామి, బాసిత్, హుస్సేన్, ఫైయుద్దీన్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు వరంగల్, హైదరాబాదు తదితర జిల్లాల నుండి వచ్చారు.












Click it and Unblock the Notifications