వైసీపీకి మరో షాక్..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి.

Eluru Municipal Corporation Mayor Shaik Noorjahan has resigned from YCP

ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది.ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కేశినేని నాని, రావేల కిషోర్ బాబు, అలీ వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె రేపు తన భర్త పెదబాబుతో కలిసి టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో నూర్జహాన్ దంపతులు పసుపు కండువా కప్పుకోనున్నారు. వారితో పాటు ఏలూరులోని పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. దాంతో ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+