రాజధాని:వెళ్లేందుకు సిద్ధంగా లేమన్న ఏపీ ఉద్యోగులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి శాఖల తరలింపు విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన రాలేదు. తాత్కాలిక రాజధానికి వెళ్లడంపై ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానికి వెళ్తే తమ పిల్లలకు సంబంధించిన స్ధానికత సమస్య వస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు 371డి మూలంగా స్ధానికత విషయంలో తలెత్తే ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమిస్తారో చెప్పాలని కోరారు. దీనికి తోడు తాత్కాలిక రాజధాని ప్రాంతంలో వసతి, విద్య, వైద్య సదుపాయాలనుపరంగా తలెత్తే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోని వాటికి పరిష్కరాలు చూపాలన్నారు.
శాఖల తరలింపుపై స్పష్టత రానుందన ఇప్పటికే పలువురు ఉద్యోగులు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పిలల పాఠశాలలు, కళాశాలలకు రుసుములు చెల్లించారనే విషయాన్ని మంత్రి,దృష్టికి ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొత్త రాజధానికి వెళ్లేందుకు తాము మానసికంగా సిద్ధంగా లేమని తెలిపారు.
ఈ సమావేశంలో గతంలో చెట్ల కిందనైనా కూర్చోని పని చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ప్రకటనపై కూడా చర్చించారు. విభజన నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఆ విధంగా పని చేయడం ఆచరణ సాధ్యం కాదని మరికొంత మంది నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications