కేసీఆర్‌కు నచ్చితే ఎంత..నచ్చకుంటే ఎంత - ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు...!!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. చంద్రబాబు లక్ష్యంగా కేసీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. దీంతో కొందరు ఏపీ నేతలు కేసీఆర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏపీ మంత్రి సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు.కేసీఆర్ సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం బాదేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సామర్ధ్యం ఏంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అలాగే దుర్మార్గమైన పనులతో, నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతు న్నామని చెప్పారు. కొందరు నేతలు, అధినాయకులు సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లాలని చూశారని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో కూడా ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఒడి ద్వారా రూ.10,090 కోట్లు పంపిణీ జరిగిందన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకి రూ.వెయ్యి కోట్లకి పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6310 కోట్లు జమ చేసిందన్నారు. అలాగే దీపం పథకం - 2 ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని.. ఇందుకోసం ప్రభుత్వం రూ.2684 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఎన్‌టీఆర్ భరోసా ఫించన్లకు గత ఏడాది రూ.33 వేల కోట్లు పంపిణీ చేసిందన్నారు. అన్నా క్యాంటీన్లని గత ప్రభుత్వం రద్దు చేసిందని.. పేద, నిరుపేదలకి ఆహారం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 4 కోట్ల మందికి భోజనాలు అందాయని.. త్వరలో గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications