నాడు జ‌గ‌న్‌..భార‌తిని వేధించారు..నేడు ఈడీ..సీబీఐ వేట‌లో చిక్కారు: అడ్డంగా దొరికిన ఈడీ అధికారి..!

పోస్టు..వెనుక రాజ‌కీయ సపోర్టు చూసుకొని నాడు చెల‌రేగిన అధికారి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. వైయ‌స్ జ‌గ‌న్ పైన ప్ర‌ముఖ‌లు సూచ‌న‌ల మేర‌కు ఇడి కేసులు బ‌నాయించి విరుచుకుప‌డిన బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇప్పుడు అదే ఈడీ అధికారుల‌కు దొరికిపోయారు. అక్ర‌మాస్తుల కేసులో సీబీఐకి చిక్కిన గాంధీ పైన ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) దాఖలు చేసింది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండ రింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. గాంధీ మీద గ‌తంలో జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు చేసారు. చం ద్రబాబుకు సన్నిహితంగా వ్య‌వ‌హ‌రించి..రాజ‌కీయ కోణంలో ప‌ని చేసిన ఆ అధికారి ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నారు.

నాడు జ‌గ‌న్‌ను వెంటాడారు..

నాడు జ‌గ‌న్‌ను వెంటాడారు..

బొల్లినేని శ్రీనివాస గాంధీ. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స‌న్నిహితుడుగా పేరు. ఆయ‌న చంద్ర‌బాబు ప‌ర‌ప‌తితో సుదీర్ఘ కాలం హైద‌రాబాద్ ఎన్‌ఫోర్స్ మెంట్‌లో ప‌ని చేసారు. జ‌గ‌న్ పైన కేసులు న‌మోదైన స‌మ‌యంలో రాజ‌కీయంగా
కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోసం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. జ‌గ‌న్ ఆస్తుల పైన ఎటాచ్‌మెంట్లు ల‌క్ష్యంగా విరుచుకు ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌లేదు. ఇక ఏపిలో 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ జ‌గ‌న్ పైన కేసులు న‌మోదైన ఎనిమిదేళ్ల‌కు జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తికి నోటీసులు జారీ చేసారు. దీనిని జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. వెంట‌నే ప్ర‌ధానికి ఫిర్యాదు పంపారు. అయినా స్పంద‌న లేదు. ఆ త‌రువాత ప్ర‌ధానిని స్వ‌యంగా కలిసి గాంధీ వ్య‌వ‌హారం మీద ఫిర్యాదు చేసారు. ఆ వెంట‌నే ప్ర‌ధాని గాంధీ వ్య‌వ‌హార శైలి మీద నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఫ‌లితంగా విచార‌ణ ప్రారంభ‌మైంది. ఆయ‌న‌ను ఇడి నుండి జీఎస్టీ విభాగానికి బ‌దిలీ చేసారు.

సీబీఐ దాడుల్లో దొరికిపోయారు..

సీబీఐ దాడుల్లో దొరికిపోయారు..

గాంధీకి తొలి నుండి టీడీపీ అధినేత‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం. రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు మేలు చేసేఉందుకు అనేక ర‌కాలుగా నాడు జ‌గ‌న్ వ్య‌వ‌హారంలో వ్య‌వ‌హ‌రించారు. స్వ‌యంగా ప్ర‌ధాని వివ‌ర‌ణ కోర‌టం .. తో గాంధీ వ్య‌వ‌హారం పైన కేంద్ర విచార‌ణ సంస్థ‌లు దృష్టి సారించాయి. ఫ‌లితంగా సీబీఐ దాడులు చేసింది. అందులో అక్ర‌మాస్తుల‌ను గుర్తించారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని గుర్తించారు.

Recommended Video

    నో బ్యాగ్ లెస్ డే సంబరాలు... విద్యార్థులతో ఆడిపాడిన టీచర్స్
     ఆస్తుల ఎటాచ్‌కు ఈడీ సన్నాహాలు

    ఆస్తుల ఎటాచ్‌కు ఈడీ సన్నాహాలు

    గాంధీ మీద మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈసీఐఆర్‌ నమోదు చేసారు. ఆస్తుల ఎటాచ్‌కు ఈడీ సన్నాహాలు మొద లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారం గా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. అనేక తెర చాటు వ్య‌వ‌హారాల‌తో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్‌ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకార మే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటేన‌ని ప్ర‌చారం జ‌రి గింది. ఇక‌..ఇప్పుడు గాంధీ మీద వ‌రుస‌గా న‌మోద‌వుతున్న కేసుల గురించి వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. అధికారులు దారి త‌ప్పి రాజ‌కీయ నేత‌ల ప్రాబ‌ల్యం కోసం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తే..ఏం జ‌రుగుతుందో గాంధీ ఉదంత‌మే ఉదాహ‌ర‌ణ అని ఆ పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+