విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందులో కీలక పాత్ర ఇంజినీర్లదే...సర్వీస్ సెక్టార్ పై ఆధారపడివున్న భవిష్యత్తు:మంత్రి లోకేష్

|
Google Oneindia TeluguNews

విజయవాడ:భవిష్యత్తులో ఆర్థికాభివృద్దిలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారని ఎపి ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలోది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో'సామాజిక ఆర్థిక అభివృద్ధి -ఇంజినీర్ల పాత్ర' అనే అంశంపై జరిగిన సెమినార్ కు మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూఇంజినీరింగ్ ప్రపంచాన్ని ఎంతగానో మార్చిందన్నారు.

ఇంజినీర్లు సైన్స్ మరియు సమాజానికి మధ్య వారధిగా నిలిచారని...మొదటి పారిశ్రామిక విప్లవం దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంజినీర్లు అనేక సమస్యలు పరిష్కరించారని లోకేష్ వెల్లడించారు.ప్రస్తుతం ప్రపంచంలో 4 వ పారిశ్రామిక విప్లవం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఇంజనీరింగ్ పై...లోకేష్ ప్రసంగం

ఇంజనీరింగ్ పై...లోకేష్ ప్రసంగం

ఇంజినీరింగ్ లో విప్లవాత్మక మార్పులు,నూతన ఆలోచనలకు ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా వేదిక గా నిలిచిందని మంత్రి లోకేష్ కొనియాడారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీ లతో అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని వివరించారు.ఇంజినీర్లు నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని...రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్దిలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని చెప్పారు. వివిధ సందర్భాల్లోప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ,చైనా,ఇండియా స్థిరమైన వృద్ధి ని సాధిస్తున్నాయని లోకేష్ వెల్లడించారు.

ఆర్థిక సంస్కరణ వల్లే...అభివృద్ది

ఆర్థిక సంస్కరణ వల్లే...అభివృద్ది

అయినా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయన్నారు.పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఆరోగ్య భద్రత, సురక్షిత తాగునీరు, విద్య విషయంలో అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. భారతదేశానికి సంబంధించి ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వలన అభివృద్ధి సాధ్యం అయిందని...

ఆ తరువాత ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు, ఫ్రీ మార్కెట్ ఎకానమీ వల్ల...విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్ పోర్టులు, రోడ్లు ఇలా మౌలిక వసతుల కల్పన లో ఎంతో అభివృద్ధి సాధ్యం అయిందని లోకేష్ వివరించారు. తద్వారా పేదరికం ఎంతో తగ్గినప్పటికీ...ఇంకా మన దేశంలో 176 మిలియన్ల మంది పేదరికంలోనే ఉన్నారన్నారు.

సర్వీస్ సెక్టార్ దే...భవిష్యత్తు

సర్వీస్ సెక్టార్ దే...భవిష్యత్తు

అయితే భవిష్యత్తు సర్వీస్ సెక్టార్ పైనే ఆధారపడి ఉందని లోకేష్ విశ్లేషించారు.మన దేశంలో మ్యానుఫ్యాక్చ్యరింగ్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు ఉన్నాయని...అసలు ప్రపంచం మొత్తానికి ఇండియా ఒక వర్క్ షాప్ లా మారే అవకాశం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. అయితే ఇదే తరుణంలోప్రపంచంతో పోటీ పడటానికి నూతన ఆవిష్కరణల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.2014 లో రాష్ట్ర విభజన జరిగిందని...ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎపికి తక్కువ తలసరి ఆదాయం ఉందన్నారు. అయితే

2022 నాటికిఎపి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటి గానూ, 2029 కల్లా నెంబర్ వన్ స్థానంలో...2050 కి ప్రపంచంలో అత్యత్తమ రాష్ట్రాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని లోకేష్ చెప్పుకొచ్చారు.

దేశంలో...ఎపినే ఫస్ట్

దేశంలో...ఎపినే ఫస్ట్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని...నూతన రాజధాని నిర్మాణానికి నూతన ఇంజినీరింగ్ ఆవిష్కరణలు దోహదపడ్డాయని లోకేష్ వివరించారు. అమరావతిని స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నామని...నూతన ఆవిష్కరణలకు అమరావతి వేదిక కాబోతోందని అన్నారు.ఆంధ్రప్రదేశ్ అనేక కీలక ఇంజినీరింగ్ ప్రాజెక్టులు ప్రారంభించిందని...నీటి భద్రత...దేశంలోనే రెండు నదులను అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్అని లోకేష్ వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా పంటలు కాపాడగలిగామని అన్నారు.

పోలవరం...వేగంగా నిర్మాణం

పోలవరం...వేగంగా నిర్మాణం

పోలవరం ప్రొజెకు నిర్మాణం వేగంగా జరుగుతోందని...దీని ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు,తాగునీరు సమస్య తీర్చడంతో పాటు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగబోతుందన్నారు.రాష్ట్రంలో చిన్న,మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేపడుతోందని...ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాల వలన ఆర్థికాభివృద్ధి వేగాన్ని అందుకుంటుందని లోకేష్ చెప్పారు. అయితేనూతన ఆవిష్కరణల వలన ప్రస్తుతం ఉన్న వ్యాపారాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయని...ప్రొడక్ట్ ఇన్నోవేషన్ పై ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఇంజినీర్లు పూర్తి సహకారం అవసరమని నారా లోకేష్ కోరారు.

English summary
Vijayawada:Minister Nara Lokesh said that engineers will play a key role in economic growth in Future. IT Minister N Lokesh attends "The Institute of Engineers India" seminar over 'Social Economic Development - The role of Engineers' in Vijayawada on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X