ఛార్జీలు తగ్గించిన APSRTC- ఈ 5 రూట్లల్లో వర్తింపు
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు. ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా తాజాగా బస్ ఛార్జీలను తగ్గించారు. ఇంద్ర, అమరావతి ఏసీ బస్సులో మాత్రమే ఈ 10 శాతం వరకు ఛార్జీ తగ్గుతుంది.

- ఈ రాయితీ డిసెంబర్ 1వ తేదీన అమలులోకి వస్తుంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఆదివారం నాడు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదు.
- గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో 10 శాతం వరకు అంటే ప్రస్తుతం ఉన్న ఛార్జీ 870 నుంచి 790 రూపాయలకు తగ్గుతుంది.
- గుంటూరు నుంచి విజయవాడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో ఛార్జీలు ప్రస్తుతం ఉన్న 970 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.
- గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 700 నుంచి 640 రూపాయలకు తగ్గుతుంది.
- తెనాలి నుంచి బీహెచ్ ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 770 నుంచి 710 రూపాయలకు తగ్గుతుంది.
- తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 960 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.












Click it and Unblock the Notifications