కెసిఆర్ ఎవరు: మీడియా బ్యాన్‌పై ఎర్రబెల్లి ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో మీడియాను తొక్కేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎవరని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసి నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. వందరోజుల పాలనలో కేసీఆర్ వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. మెదక్‌లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు.

వంద రోజుల్లో తాను ఏ పనీ చేయలేదంటున్న కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసమే సంగారెడ్డి, సిద్ధిపేటను జిల్లాలుగా మారుస్తామని ప్రకటన చేశారని ఎర్రబెల్లి అన్నారు.గోల్కొండపై జెండా ఎగురవేసిన నాటి నుంచి కేసీఆర్‌లో నిజాం నిరంకుశత్వం ప్రవేశించిందని ఆయన దుయ్యబట్టారు.
సర్పంచ్‌లను తొలగించే అధికారం కెసిఆర్ ఎవరిచ్చారని ఎర్రబెల్లి నిలదీశారు. దమ్ముంటే బడ్జెట్ సమావేశాలు పెట్టాలన్నారు. తెలంగాణ ఇచ్చి అధికారం తెచ్చుకోలేని పార్టీ కాంగ్రెస్ అని, మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications