ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాం
చంద్రబాబు నాయుడు పాలనలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి జయరాం అన్నారు. ఇందుకు ఈఎస్ఐ స్కాం నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఎంతటివారినైన చర్యలు తప్పవని.. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టంచేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు సహా బాధ్యులందరీపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

లేఖే సాక్ష్యం
ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే సాక్ష్యంగా నిలుస్తోందని మంత్రి జయరాం పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు సహా అవినీతికి పాల్పడిన వారందరిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి సంబంధించి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పొట్ట కోట్టి.. కోట్ల రూపాయలు దోచుకుందని విమర్శించారు.

నయా పైసా కూడా..
గత ప్రభుత్వం అక్రమంగా చెల్లించిన నయా పైసా కూడా రికవరీ చేస్తామని మంత్రి జయరాం తెలిపారు. ఇందులో సందేహానికి తావులేదని పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణతో కార్మికులకు న్యాయం జరిగిందని చెప్పారు. తప్పుచేసిన వారిని జైలుకు పంపించేవరకు వెనకడుగు వేయబోయని మంత్రి స్పష్టంచేశారు. ప్రతీ కార్మికుడికి మందులు సరఫరా చేస్తామని తెలియజేశారు. కార్మికుల ఆరోగ్యం కోసం, కార్మికుల కుటుంబాలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు మంత్రి జయరాం.

అచ్చెన్నాయుడు రియాక్షన్
ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు.

ఇలా వెలుగులోకి..
టెలీ హెల్త్ సర్వీసెస్‌కు మేలు జరిగేలా నామినేషన్ పద్ధతిలో మందులు ఇవ్వాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు లేఖ రాశారు. దీంతో రూ.400 కోట్ల వరకు ప్రజాధనం దోపిడికి గురైంది. ఈ విషయం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించగా.. మంత్రి జవహర్ కూడా రియాక్టయ్యారు. తప్పుచేసినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications