అనూహ్య తిరిగి రాదు: తల్లిదండ్రుల శోకం తీరేదా? (పిక్చర్స్)
విజయవాడ: తన బిడ్డ తిరిగి రాదని తెలుసునని, అయినా ఇక ముందు ఎవరూ ఇటువంటి ఘోరం చేయకుండా ఉండడానికి దోషికి మరణశిక్ష విధించడమే సరైందని మచిలీపట్నం టెక్కీ అనూహ్య తండ్రి ఎస్. జోనాథన్ సురేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ మాటలు అతను అంటున్నప్పుడు కూతురిని కోల్పోయిన అనూహ్య తల్లిదండ్రుల శోకం ఈ జీవిత కాలంలో తీరేదేనా అని అనిపించకమానదు.
అనూహ్యను హత్య చేసిన చంద్రభాన్ సుదమ్ సనప్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి స్పందించారు. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్. నేరప్రవృత్తి గలవాళ్లకు బలమైన సంకేతాలు ఇవ్వడానికి, నేరాలను తగ్గించడానికి దోషికి మరణశిక్ష విధించడమే న్యాయమని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు ఆ విషయంపై తాము బయటపడలేదని, అయితే అతనికి మరణశిక్ష పడాలని మాత్రం మనస్సులో కోరుకున్నానని ఆయన చెప్పారు. దేశంలో అమ్మాయిలు జీవించడానికి తగిన స్వేచ్ఛావాతావరణం కోసం దోషికి మరణశిక్షే శరణ్యమని ఆయన అన్నారు.

మారుతాడనే నమ్మకం లేదు..
జీవిత ఖైదు విధిస్తే తన కూతురు అనూహ్యను హత్య చేసిన చంపిన చంద్రభాన్‌లో మార్పు వస్తుందని తాను నమ్మడం లేదని ప్రసాద్ అన్నారు.

ఆ తర్వాత కూడా..
తన కూతురి హత్య తర్వాత కూడా మహిళలపై చాలా నేరాలు జరిగాయని, నేరగాళ్లకు మరణశిక్ష పడడమే సరైందని ప్రసాద్ అన్నారు.

స్నేహితుల్లాగా ఉండేవాళ్లం..
అనూహ్య చాలా కామ్ గర్ల్ అని, తమతో అన్ని విషయాలు పంచుకునేదని, తాము స్నేహితుల్లాగా ఉండేవాళ్లమని అనూహ్య తల్లి జ్యోత్స్న అన్నారు.

ఇలా గడ్డం పెంచాడు..
అనూహ్య హంతకుడు చంద్రభాన్ తప్పించుకోవడానికి గడ్డం పెంచుకుని నాసిక్‌లో అమాయకంగా తిరుగుతుండేవాడు.

చివరి క్రిస్ట్మస్ అదే..
అనూహ్య చివరగా క్రిస్ట్మస్ పండుగను 2013లో మచిలీపట్నంలోని తన ఇంట్లో జరుపుకుంది. అనూహ్య కేసులో దోషిగా మరణశిక్ష పడడం ఆ కుటుంబ సభ్యులకు కాస్తా ఊరటనిచ్చినట్లు కనిపించింది.












Click it and Unblock the Notifications