బాలినేని పిటీషన్ వాయిదా.. ఆగిన ఒంగోలు ఈవీఎం రీవెరిఫికేషన్!
ఒంగోలు నియోజకవర్గంలో నేటి నుండి ఆరు రోజుల పాటు రీ పోలింగ్ జరగాల్సి ఉంది. మళ్ళీ వివిధ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నిజమే ఒంగోలు లో ఓటర్లు నేడు మళ్ళీ ఓట్లు వేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ బాలినేని తాజా డిమాండ్ తో మళ్ళీ ఈవీఎం ల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది.
ఈవీఎంల రీ వెరిఫికేషన్ లో అనూహ్య పరిణామాలు
వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థనతో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నేటి నుండి ఆరు రోజుల పాటు 12 పోలింగ్ బూత్ లలో ఓట్లు వేయించి , ఆ ఓటు ఎవరికి వేశారు, ఎవరికి నమోదైంది అనేది బహిరంగంగానే చెక్ చెయ్యనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కు మళ్ళీ వినియోగించుకోవాల్సి ఉండగా నేడు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బాలినేని తరపు ప్రతినిధులు వాకౌట్
నేడు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి, భెల్ సిబ్బంది ఈవీఎంల రీ చెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఈవీఎం లతో పాటు వీవీ ప్యాట్ లను కూడా కౌంట్ చెయ్యాలని బాలినేని తరపు ప్రతినిధులు అధికారులను కోరారు. దీనికి వారు కుదరదని చెప్పగా బాలినేని ప్రతినిధులు పోలింగ్ కేంద్రం వాకౌట్ చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన బాలినేని
దీంతో ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీ చెకింగ్ పై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్ లు కూడా లెక్కించాలని మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలినేని రిట్ పిటీషన్ రేపటికి వాయిదా
ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాలినేని తరపు అడ్వకేట్లు కోర్టులో ఎన్నికల కమీషన్ మాక్ పోలింగ్ విధానంలో ఈవీఎంల రీ వెరిఫికేషన్ చెయ్యాలని పేర్కొందని, అయితే అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాదులను కౌంటర్ కోరగా రేపు తమ వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటీషన్ పై విచారణని రేపటికి వాయిదా వేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications