సీఎం చంద్రబాబు యూటర్న్
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి, ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముందు నుంచి చెబుతునే ఉన్నామని , అయిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయలో పడ్డారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్ర ఖజానాలో డబ్బులేవని చెబుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని ఆయన దుయ్యపట్టారు.
గెలిచిన తర్వాత చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 మొదలగు పథకాలు కోసం మహిళలు ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల గ్రాంట్ వచ్చిందంటున్నారు.. తీరా చూస్తే అది అప్పు అని తేలిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. భూముల సర్వేపై చంద్రబాబుకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిటీష్ కాలం నుంచి భూముల సర్వే జరగలేదని.. అందుకే భూ సమస్యలు ఉండకూదని కేంద్రం భూసర్వే చేయిస్తోందని చెప్పారు. హక్కుదారులకే భూమి ఉండాలని తమ ప్రభుత్వం భావించిందన్నారు. అసైన్డ్ భూములు విషయంలో చంద్రబాబు మాట తప్పితే, జగన్ సీఎం అయిన తర్వాత పేద ప్రజలకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కు కల్పిస్తూ చట్టం కల్పించారని గుర్తు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాము బెదరబోమని అన్నారు. గతంలో వైసీపీపై అనేక కుట్రలు చేసినా జగన్ తట్టుకొని గెలిచారని గుర్తుచేశారు. తమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications