Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ 100 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా, అప్పుల్లో ఉన్నా- మాజీ మంత్రి అనిల్..!!

టీడీపీ నేత నారా లోకేశ్ కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేసారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు సంబంధం లేని భూములను అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. భూములు కబ్జా అంటూ పసలేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అక్రమాలు చేయలేదని ప్రమాణం చేసే ధైర్యం నారాయణకు ఉందా అని అనిల్ ప్రశ్నించారు.

అనిల్ వర్సస్ లోకేశ్
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన లోకేశ్ పలు ఆరోపణలు చేసారు. వీటి పైన అనిల్ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌ చేసిన ఆరోపణలపై నెల్లూరు నియోజకవర్గంలోని వెంకటేశ్వరపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు 10 గంటలకు ప్రమాణం చేస్తానని ప్రకటించారు. లోకేష్‌ వచ్చినా, రాకపోయినా, తనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టే ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యానని చెప్పారు. ఖర్జూరనాయుడు ఇచ్చిన 2 ఎకరాలతోనే ఇన్నేళ్లు రాజకీయం చేశామని, పాదయాత్రలో కనిపించే చిన్న దేవాలయంలోనైనా ప్రమాణం చేసే ధైర్యం లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. వెయ్యి కోట్లు అని లోకేశ్ తన పైన ఆరోపణలు చేసారని.. తాను రూ 3 కోట్ల అప్పుల్లో ఉన్నానని వెల్లడించారు.

Anil Kumar Yadav

ఆస్తులు పోగొట్టుకున్నా..అప్పుల్లో
తాను మంత్రి అయిన తరువాత రూ 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూలతో తన సైట్ ను అమ్మినట్లు వివరించారు. తాను అమ్ముకున్న ఆస్తి నుంచి వచ్చిన డబ్బుతో మరో చోట స్థలం కొనుగలో చేసినట్లు చెప్పారు. తనకు ఇస్కాన్‌ సిటీలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల 98 సెంట్లు తప్ప.. ఏమీ లేదని వివరించారు. తన కుటుంబానికి ఇస్కాన్‌ సిటీలో 18 ఎకరాల ఆస్తి ఉంటే.. ఈరోజు 3.98 ఎకరాలు మాత్రమే ఉందిన్నారు 14 ఎకరాలు ఇస్కాన్‌ సిటీలో అమ్ముకున్నామని చెప్పారు. దాదాపు రూ.100 కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని అనిల్ వెల్లడించారు. చెన్నైలో 50 కోట్ల ఇల్లు ఉందని నారా లోకేష్‌ నాపై ఆరోపణ చేశారని... నెల్లూరు జిల్లా దాటి జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు వెతికినా సెంటు భూమి కూడా ఉండదన్నారు.

Anil Kumar Yadav

ప్రమాణానికి సిద్దం
తన ఆస్తులు తన కుటుంబ సభ్యుల పేరుమీద కానీ, ఒక్క సెంటు భూమి కూడా నెల్లూరు జిల్లా తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. తన పెళ్లికి కానుకగా ఇచ్చిన 8 సెంట్లు హైదరాబాద్‌లో నా భార్య పేరు మీద ఉండొచ్చని వివరించారు. 206లో తన పైన నింద వేస్తే అమ్మవారి దగ్గరకు వెళ్లి ప్రమాణం చేసానని గుర్తు చేసారు. నిజాయితీ ఉంది కాబట్టే..2019లో గెలిచి మంత్రి అయ్యాననన్నారు. లోకేశ్ ఆరోపణల పైన ఇప్పుడు ప్రమాణానికి సిద్దమన్నారు. అమరావతిలో బినామీల పేర్లతో పొలాలు లేవని, కాలేజీ ఫీజులు పెంచి దోపిడీలు, అక్రమాలు చేయలేదని ప్రమాణం చేసే ధైర్యం నారాయణకు ఉందా అని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+