జగన్ కు షాక్ ఇచ్చే వ్యూహంలో మాజీమంత్రి బాలినేని.. ఒంగోలులో చర్చ!
వైసిపి అధిష్టానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ తనను పట్టించుకోవడం లేదని, ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తను వైసీపీకి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు ఒంగోలులో జోరుగా చర్చ సాగుతుంది.
వైసీపీపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
తాజాగా బాలినేని ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసిపి అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరు వినేవారు లేరని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది తాను జనసేనలోకి వెళుతున్నాను అని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి బాలినేని జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

జనసేన లో చేరేందుకు బాలినేని ప్లాన్
అయితే ఆయన జనసేన లోకే వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. పార్టీ మారే ఆలోచన ఉండే ఆయన ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని సమాచారం. తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలపైన కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. వైసీపీ ఓటమి పాలు కావటంతో పార్టీ మారాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారు.
బాలినేని పరిస్థితి ఇలా
అయితే టీడీపీలోకి బాలినేనిని తీసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడ్డు పడుతున్నాడు. జనసేనలో చేరాలని ప్రయత్నం చేస్తున్న బాలినేని విషయంలో జనసైనికులు కూడా అభ్యంతరం చెప్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలో సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది. ఇక వైసీపీలో ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఎన్నికలకు ముందు నుండీ బాలినేనికి నచ్చటం లేదు. పార్టీపై అసహనంతోనే బాలినేని ఎన్నికలకు ముందు నుండీ కొనసాగుతూ వస్తున్నారు.
బాలినేని వ్యాఖ్యల వెనుక వ్యూహం ఇదే
ఈ క్రమంలో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారన్నది స్థానికంగా ఒంగోలులో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటినుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశం ఉండటంతోనే బాలినేని వ్యాఖ్యలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications