Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనిల్ పై పోటీకి టీడీపీ యువనేత - గంటా దౌత్యం, నారాయణ కిం కర్తవ్యం..!?

నెల్లూరు కేంద్రంగా టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్న టీడీపీ ఇప్పుడు ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తోంది. మాజీ మంత్రి అనిల్ నియోజకవర్గం లో మాజీ మంత్రి నారాయణకు టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించింది. ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ గంటా కుమారుడు పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ యువగళం యాత్ర వేళ ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.

గంటా వారుసుడి ఎంట్రీ : నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లా నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీకి అనుకూలంగా ఓటింగ్ చేసి సస్పెండ్ అయ్యారు.

anilkumaryadav

ఆ ముగ్గురు ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు నెల్లూరులో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని పార్టీ నాయకత్వం మాజీ మంత్రి నారాయణ కు కేటాయించింది. 2019 ఎన్నికల్లో నారాయణ పైన వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. ఈ సారి కూడా నారాయణ వర్సస్ అనిల్ పోటీ ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి కొత్త నేత ఎంట్రీ ఇచ్చారు.

నారాయణ స్థానంలో బరిలో : మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తనయుడు..మరో మాజీ మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. అనూహ్యంగా లోకేశ్ నెల్లూరు సిటీలో ప్రవేశించే సమయంలో క్రియాశీలకంగా మారారు. తండ్రి విశాఖ జిల్లా నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు.

మామ నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే లోకేశ్ యాత్ర వేళ కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గంటా రవితేజ నెల్లూరు సిటీ నుంచి పోటీకి సిద్దమనే సంకేతాలు మాజీ మంత్రులు గంటా..నారాయణ పార్టీ ముఖ్య నాయకత్వానికి పంపారు. నారాయణ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

exministergantasonraviteja

అనిల్ వర్సస్ రవితేజ : ఈ క్రమంలో నెల్లూరు సిటీ నుంచి రవితేజ ను పోటీకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం లోకేశ్ యాత్రలో నారాయణ తన ఇద్దరు కుమార్తెలు..అల్లుడు రవితేజతో కలిసి పాల్గొనటం జిల్లాలో సంచలనంగా మారింది. నారాయణ కుమార్తెలు ఎప్పుడూ రాజకీయంగా బయటకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా చోడవరం లేదా అనకాపల్లి నుంచి తన కుమారుడు రవితేజను బరిలోకి దింపాలని గంటా ఆలోచన చేసినట్లు సమాచారం.

అయితే, సీనియర్ల వారసుల పోటీ జిల్లాలో ఎక్కువగా ఉండటంతో..గంటాకు టీడీపీ నాయకత్వం నుంచి ఆమోదం ఇంకా లభించలేదు. దీంతో..నారాయణ తన స్థానం అల్లుడికి ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరి ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో కీలక పాత్రకు సిద్దమని చెబుతున్నట్లు సమాచారం. దీంతో...మాజీ మంత్రి అనిల్ పైన వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకూలిస్తే గంటా రవితేజ పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+