నారాయణకు బెయిల్ మంజూరు - ఏడేళ్ల క్రితమే రాజీనామా : సంబంధం లేదంటూ..!!

ఏపీ మాజీ మంత్రి..నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్‌ లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం చిత్తూరు తీసుకొచ్చి..వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తరువాత నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వద్ద 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తి ఆధారాలు చూపించారు.

ఆ సంస్థలతో సంబంధం లేదు

ఆ సంస్థలతో సంబంధం లేదు

నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. దీంతో..పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.

బెయిల్ మంజూరు చేస్తూ

బెయిల్ మంజూరు చేస్తూ

ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని నారాయణ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక, హైదరాబాద్ లో నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రశ్నపత్రం వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైందని..ఇందులో నారాయణ కళాశాలల డీన్‌ బాలగంగాధర్‌ తో సహా ఏడుగురి పైన కేసులు నమోదు చేసామని చిత్తూరు ఎస్పీ చెప్పారు.

పూర్తి ఆధారాలతోనే అరెస్ట్

పూర్తి ఆధారాలతోనే అరెస్ట్

ప్రశ్నాపత్రాలను బయటకు పంపటం..తిరిగి సమాధానాలు ఏ రకంగా పరీక్షా హాల్ లోకి పంపేది అదుపులోకి తీసుకున్న వారి నుంచి పూర్తి సమాచారం సేకరించామని చెప్పారు. ఇది ముందస్తు ప్రణాళికతో కొనసాగుతున్న నేరంగా వివరించారు. ప్రతీ సారి ఇదే విధంగా చేస్తున్నారని..పూర్తి ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేసామని వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించారు. ఇక, వైద్య పరీక్షల తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా...బెయిల్ ముంజూరు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+