వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి పుల్లారావు సవాల్: రైతుల ఆందోళనకు మద్దతుగా: అదే ఏకైక అజెండా..!

|
Google Oneindia TeluguNews

అమరావతిలో స్థానికులు..రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రులు వారి నిరసనల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అదే సమయంలో మంత్రి బుగ్గనకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ చేసారు. తన పేరుతో రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని..బినామీ పేర్లతో కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. తన పేరు మీద మూడు గజాలు .చూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్దమని స్పష్టం చేసారు.

నిరూపిస్తే ఆయనకే రాసిస్తాను..
తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ బుగ్గన మాజీ మంత్రి పుల్లారావు పేరు ప్రస్తావించారు. తన పేరుతో మూడు గజాలు‌ చూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్దమంటూనే.. ఎవడో సురేష్ బినామీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆ 38 ఎకరాలు‌ నిరూపిస్తే బుగ్గనకే రాసిస్తాను. లేకుంటే ఆయన రాజీనామా చేస్తారా..అని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలకు, మాజీ మంత్రులకు భూములున్నట్లు అసెంబ్లీ వేదికగా రూట్ మ్యాప్‌తో సహా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ మాజీ మంత్రులు పుల్లారావుతో సహా నారాయణ.. పలువురు టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు బుగ్గన దీని పైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ex Minister Pullarao challeged Minister Buggana to proove his allegations on insider trading

రైతులకు మద్దతుగా ఆందోళనల్లో..
అమరావతి నుండి రాజధాని తరలింపు వ్యవహారం పైన అక్కడ రైతులు చేస్తున్న ఆందళనకు మద్దతుగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మందడంలో పోలీసులు టెంట్ వేసుకొనియ్యకపోతే రైతుల ఉద్యమం ఆగదని ఆయన చెప్పుకొచ్చారు.

పార్టీలకు అతీతంగా అందరూ రైతుల పక్షాన నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గతంలో వరదల సమయంలో కర్నూల్ మునగలేదా..తుఫాన్ వస్తే విశాఖ నగరం కూలలేదా.. అంటూ వైసీపీ సర్కార్‌ను పుల్లారావ్ ప్రశ్నించారు. రాజధాని మార్చే హక్కు ఈ సీఎంకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని ఏకైక అజెండగా ముందుకు వెళ్దామని మాజీ మంత్రులు పిలుపునిచ్చారు.

English summary
Ex minister Pullarao challeged Minister Buggana to proove his allegations on insider trading in Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X