ఈవీఎం ట్యాంపరింగ్ అని అప్పుడే తెలిసింది - రోజా
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పక్కా వైసీపీ పోలింగ్ బూత్‌ల్లో కూడా కూటమికి మెజార్టీ సాధించడం పలు అనుమానాలకు దారి తీసింది. పోలైన ఓట్ల కన్నా, లెక్కించిన ఓట్లే అధికంగా ఉండటంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా మాజీ మంత్రి రోజా సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రోజా మాట్లాడుతూ..తొలి రౌండ్లో తనకు బాగా కలిసివచ్చే వడమాలపేట ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అయితే అక్కడే ప్రత్యర్థికి 3వేల మెజారిటీ రావడం చూసి తాను షాక్ తిన్నానని.. దీంతో ఎన్నికలు సక్రమంగా జరగలేదని, ఈవీఎంలలో ఏదో చేశారని అర్థమై.. తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

తాను నగరి నియోజకవర్గంలో ఎంతో చేశానని.. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేశామని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు, మూడు వేల ఓట్లతోనె గెలిచిన చోట ఆయన కుమారుడు మాత్రం 40 వేల మెజారిటీతో ఎలా గెలుస్తాడు అంటూ రోజా ప్రశ్నించారు. ఇదే సమయంలో... ఎన్నికలకు సుమారు రెండు నెలల ముందు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా తెలిపారు. అందుకే ఈ ఎన్నికలను తాను నమ్మడం లేదని.. ప్రతీ ఇంటికీ ఎంతో మంచి చేసిన జగన్ లాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసె పరిస్థితి లేదని ఆమె తెలిపారు. ఇక ఈవీఎంల గురించి వైసీపీ అధినేత జగన్ సైతం స్పందించారు.
ఈవీఎల పనితీరును జగన్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి,, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications