విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ !?.. పీకే వ్యూహాంతో వైసీపీ కుట్రలు : సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

గత చంద్రబాబు పాలనలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా ఖండించింది. దీనిని టీడీపీ కొనుగోలు చేసిందనేది పెద్ద బ్లండర్ అని కొట్టిపారేసింది. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీపై కట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీకి పెగాసెస్‌పై అవగాహన లేక మాట్లాడి ఉండవచ్చని పేర్కొన్నారు.

 పెగాసెస్ కొనుగోలు చేస్తే వివేకా హ‌త్య జ‌రిగేది కాదు .

పెగాసెస్ కొనుగోలు చేస్తే వివేకా హ‌త్య జ‌రిగేది కాదు .


అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెగాసస్ స్పైవేర్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసే అవకాశామే లేదని సొమిరెడ్డి కొట్టిపారేశారు. దేశాల మధ్య రహస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారని పేర్కొన్నారు. కేంద్రం అనుమతి లేకుండా దీనిని కొనుగోలు చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. పెగాసెస్ స్పైవేర్ తమ ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగే అవకాశం ఉండేది కాదు కదా.. అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

 పీకే వ్యూహాంలో భాగంగా టీడీపీపై కుట్ర‌లు

పీకే వ్యూహాంలో భాగంగా టీడీపీపై కుట్ర‌లు


టీడీపీపై కుట్రలో భాగంగానే జగన్ కొత్త డ్రామాలకు తెరతీశారని సోమిరెడ్డి దుయ్యబట్టారు. పీకే, కేకేల వంటి వారు మమతా బెనర్జీతో చంద్రబాబుపై అలా మాట్లాడించి ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు అనేక తప్పుడు ప్రచారాలను చేశారని మండిపడ్డారు. జగన్, కేసీఆర్, మమతాలకు పీకే వ్యూహ కర్త. టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేష్‌లను పీకే వ్యూహాలను అమలు చేస్తూ డ్యామేజ్ చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో జగన్ కోడి కత్తి కేసు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కాలు కట్టు కట్టించి రాజకీయం చేసింది, వ్యూహాల‌కు కుట్ర‌లు ప‌న్నింది ప్రశాంత్ కిషోర్ అని సోమిరెడ్డి ఆరోపించారు. అధికారం ఎన్ని అడ్డదారులైనా, కుట్రలకైనా జగన్ వెనుకాడరని విరుచుకుపడ్డారు.

టీడీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్

టీడీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్


అటు టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి ఆరోపించారు. కొంత‌మంది అధికారల ఫోన్లు సైతం ట్యాప్ చేస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓ సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా త‌మ ఫోన్లు ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు ఆదుపులేకుండా ఉందని మండిపడ్డారు. సీఎం జగన్ దోపిడీకి అంతులేకుండా పోతుందని మండిపడ్డారు. కల్తీ మద్యం, సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలన్నీ వైసీపీ నేతలవే అని సొమిరెడ్డి ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఏడాదికి రూ. 5 వేల కోట్లు దండుకుంటూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
TDP leaders' phones tapping!? .. YCP conspiracies with PK strategy: Somireddy sensational comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X