గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం షాపుల్లో జగన్ బ్రాండ్లు: చీప్ లిక్కర్ అమ్ముతున్న వలంటీర్లు: నాణ్యమైన మద్యం ఏదీ: బోండా ఉమా

|
Google Oneindia TeluguNews

గుంటూరు: రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించే దిశగా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా- మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసి వేయించడం, టాప్ బ్రాండ్ల రేట్లను భారీగా పెంచడం వంటి ప్రయత్నాల వల్ల క్రమంగా సామాన్యులకు మద్యాన్ని దూరం చేయాలనేది ప్రభుత్వ వ్యూహం. దీనికి అనుగుణంగానే- మద్యం విధానాన్ని కూడా రూపొందించింది. పక్కాగా అమలు చేస్తోంది.

నక్క తోక తొక్కిన టీడీపీ ఎంపీ: ఆయన కంపెనీలో వంద కోట్ల పెట్టుబడి: తైవాన్ సంస్థ రెడీ: చిత్తూరులో యూనిట్నక్క తోక తొక్కిన టీడీపీ ఎంపీ: ఆయన కంపెనీలో వంద కోట్ల పెట్టుబడి: తైవాన్ సంస్థ రెడీ: చిత్తూరులో యూనిట్

కమిషన్లను పిండుకోవడానికే..

కమిషన్లను పిండుకోవడానికే..

మద్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహాలు, విధానాలు.. ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. కొత్త మద్యం విధానాన్ని అడ్డుగా పెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయల మేర కమిషన్లు పిండుకుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆరోపిస్తున్నారు. కమిషన్లను ఇచ్చే మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.

 దశలవారీగా మద్య నిషేధం వెనుక కమిషన్ల కుట్ర..

దశలవారీగా మద్య నిషేధం వెనుక కమిషన్ల కుట్ర..

మంగళవారం ఉదయం ఆయన గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా మద్యం విధానాన్ని అమలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వైసీపీ నేతలు లిక్కర్ తయారీదారుల నుంచి 300 కోట్ల రూపాయల మేర కమిషన్లను దండుకున్నారని ఆరోపించారు. దశలవారీగా మద్యాన్ని నిషేధించడం వెనుక ఉన్న కుట్ర అదేనని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఒకే దఫాలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ బ్రాండ్లు..

జగన్ బ్రాండ్లు..

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లభించే మద్యం బ్రాండ్లు.. ఇప్పుడు మన రాష్ట్రంలో మాత్రమే లభించట్లేదని అన్నారు. కొన్ని మద్యం బ్రాండ్ల పేర్లను ఆయన చదవి వినిపించారు. అలాంటి టాప్ క్లాస్ లిక్కర్‌కు భిన్నంగా.. పిచ్చి, పిచ్చి కంపెనీలు తయారు చేసే మద్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. పేరు తెలియని కంపెనీలు ముడుపులు చెల్లించడం వల్లే వాటికి అనుమతి లభిందని అన్నారు. అవన్నీ జగన్ బ్రాండ్లుగా గుర్తింపు పొందాయని ఎద్దేవా చేశారు.

Recommended Video

Botsa Satyanarayana Reacts On Chandrababu's Vizag Airport Issue | Oneindia Telugu
పనులన్నీ మానుకుని మద్యం దుకాణాల వద్ద బారులు..

పనులన్నీ మానుకుని మద్యం దుకాణాల వద్ద బారులు..

వైసీపీ నాయకులు జే-ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యపాన ప్రియులు తమ పనులన్నింటినీ మానుకుని మరీ ఎనిమిది గంటలకే మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని, ఈ దుస్థితికి ఎవరు కారణమని బోండా ఉమా నిలదీశారు. కొన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. చీప్ లిక్కర్, నాటుసారాను వలంటీర్లు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

English summary
Telugu Desam Party senior leader and Ex MLA Bonda Umamaheshwara Rao alleged on ruling YSR Congress Party leaders for taking bribe from the liquor companies to sale thier brand in the Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X