హైకోర్టులో జోగయ్య వ్యాజ్యం: ప్రతివాదిగా సీఎం - రిజిస్ట్రీ అభ్యంతరం..!!
కాపు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదిగా సీఎం పేరు ప్రస్తావనపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసారు.
కాపు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ వ్యాజ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలుచేసేలా ఆదేశించాలని కోరారు. అయితే, వ్యాజ్యంలో సీఎం జగన్‌ని ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యానికి నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. దీంతో..ముఖ్యమంత్రిని ప్రతివాదిగా తొలగిస్తామని జోగయ్య తరపు న్యాయవాది వెల్లడించారు.
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల పైన కొంత కాలంగా మాజీ ఎంపీ హరి రామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి లేఖలు రాసారు. ఆమరణ దీక్షకు దిగారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ జోక్యంతో దీక్షను విరమించారు. ఇప్పుడు ఇదే అంశం పైన హైకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలుచేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చటం పైన హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నెంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారం పైన న్యాయమూర్తి రఘునందన్ రావు విచారణ జరిపారు.

పిటీషర్ తరపు న్యాయవాది తన వాదనల్లో భాగంగా.. కాపులకు రిజర్వేషన్ల అంశం పై ప్రభుత్వంలో ఏం జరిగిందో వివరించారు. కాపుల రిజ్వేషన్ల పైన మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చారని కోర్టుకు నివేదించారు. రిజర్వేషన్ల పైన జీవో తెచ్చరని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలులో ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని వివరించారు. స్పందించిన న్యాయమూర్తి మ్యానిఫెస్టో అంశాల అమలుకు న్యాయస్థానాలు ఆదేశించలేవన్నారు. ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలిగిస్తామని పిటీషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు. సీఎం పేరు తొలిగించేందుకు అంగీకరించటంతో ఈ వ్యాజ్యానికి నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ పిటీషన్ పైన మంగళవారం విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications