వచ్చే ఎన్నికల్లో ఆయనెలా గెలుస్తారో.. నేనూ చూస్తా?

చంద్రబాబును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రత్యర్థుల జాబితాలో కన్నా ప్రథమంగా ఉంటారు.

సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ తన చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడి పార్టీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పదవితోపాటు రెండు నియోజకవర్గాల బాధ్యత కూడా కన్నాకు అప్పగించినట్లు తెలుస్తోంది. కన్నా వయసు దాదాపు 70 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు వ్యవహరించారు.

చంద్రబాబును వ్యతిరేకించేవారిలో మొదటివారు కన్నా

చంద్రబాబును వ్యతిరేకించేవారిలో మొదటివారు కన్నా

చంద్రబాబును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రత్యర్థుల జాబితాలో కన్నా ప్రథమంగా ఉంటారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కూడా హననం చేశారు. అంతేకాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలిపెట్టకుండా దారుణ పదజాలం ఉపయోగించిన కన్నా 40 సంవత్సరాలుగా అసెంబ్లీ లోపల, బయట తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుణ్ని దుర్భాషలాడిన నాయకుడు.

అటువంటి నాయకుణ్ని అక్కున చేర్చుకొని పార్టీ కార్యకర్తలపై రుద్దారంటూ తెలుగు తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. చంద్రబాబునాయుడు మారడదని, పార్టీ కోసం తాను సర్దుకుపోక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్నా వర్సెస్ రాయపాటికి వేదికగా టీడీపీ

కన్నా వర్సెస్ రాయపాటికి వేదికగా టీడీపీ

తొలి నుంచి గుంటూరు జిల్లా రాజకీయం రాయపాటి సాంబశివరావు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ మధ్య నడిచింది. సుదీర్ఘకాలం వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాయపాటిని సైకిల్ కాంగ్రెస్ అని కన్నా వ్యాఖ్యానించేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి, కన్నా కు మధ్య హోరాహోరీగా పోరు నడిచేది.

ఉమ్మడి రాష్ట్రం సమయంలో రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీపడినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని వరించింది. విభజన అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత క్రమేణా అమరావతికి మద్దతు పలికారు.

తగ్గుతూ వచ్చిన విభేదాలు

తగ్గుతూ వచ్చిన విభేదాలు

రోజులు గడిచేకొద్దీ గతంలో ఉన్నటువంటి విభేదాలు తగ్గుతూ వచ్చాయి. మాటల్లో పదును కూడా తగ్గింది. చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరూ తరుచుగా కలుసుకుంటూ వచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న దూరం కూడా తరిగిపోయింది. సిద్ధాంతాల పరంగా వ్యతిరేకించాంకానీ వ్యక్తిగతంగా కాదని చంద్రబాబు, కన్నా ఇద్దరూ చెప్పారు.

ఆచరణ సాధ్యమేనా?

ఆచరణ సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ రాయపాటి వర్గం కన్నా వర్గం మీద శంఖం పూరించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. వీరిద్దరూ పోరు సలపడానికి తెలుగుదేశం పార్టీ వేదికగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనతోపాటు ఉన్న కొంతమంది సీనియర్లను పార్టీలోకి తెచ్చే పనుల్లో కన్నా బిజీగా ఉన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీలోని యువతరం గుర్రుగా ఉంది. టికెట్లలో 40 శాతం యువతకు ఇస్తామన్నారని, చూస్తుంటే.. అది ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడంలేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+