అమరావతి నిర్మాణంలో అనూహ్యం..: మరో కంట్రీ.. ఎంట్రీ
Amaravati: రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది.
అమరావతిలో నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో.. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది.

అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో సైతం పర్యటించిన విషయం తెలిసిందే. ఆ దేశ మంత్రులతో వారు సమావేశం అయ్యారు. మంత్రి టాన్ సీ లెంగ్ తో చంద్రబాబు స్వయంగా భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణంలో భాగం కావాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించలేదంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ పరిణామాల మధ్య మరో కొత్త దేశం ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సింగపూర్ కు బదులుగా వియత్నాం ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. అమరావతిలో 2,000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను డెవలప్ చేయడానికి వియత్నాం ముందుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది.
అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిని చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో 2018లో సింగపూర్ ఇచ్చిన ప్రణాళికల కంటే మరింత మెరుగ్గా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంటుందని భావిస్తోన్నారుు. విన్ గ్రూప్ అందజేసిన ప్రతిపాదనలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చించాల్సి ఉందని తెలుస్తోంది. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఒప్పందం కుదుర్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.
నిజానికి- 2018లో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2019లో ప్రభుత్వం మారడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో దీనికి బ్రేక్ పడింది. అప్పట్లో సింగపూర్- సీఆర్డీఏ మధ్య 1,679 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒప్పందం కుదిరింది.












Click it and Unblock the Notifications