పిన్నితో అక్రమ సంబంధం: ఆమె మరణానికి అదే కారణం?

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన చిలకపాటి పోశమ్మ ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తన భర్త మొదటి భార్య కుమారుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే మృతి కారణమని తెలుస్తోంది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుగంటివారిపేటకు చెందిన చిలకపాటి వెంకన్న మొదటి భార్య లేకపోవడంతో పోశమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య కుమారుడు నాగేంద్ర పిన్ని వరసయ్యే పోశమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Extra marital relation leads to the death of a woman?

ఈ విషయం నాగేంద్ర భార్య దివ్యకు తెలియడంతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మరోసారి పోశమ్మ, నాగేంద్ర, దివ్య మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో పోశమ్మ కుమార్తె పీతల సునీత ఇంటికి వచ్చింది.

ఈ గొడవతో మనస్తాపం చెంది వెనుదిరిగి వెళ్లిపోయింది. అయితే కొద్దిసేపటికే ఆమెకు పోశమ్మ చనిపోయిందని ఫోన్‌ వెళ్లింది. అదే రోజు రాత్రి తిరిగి ఇనుగంటివారిపేట చేరుకుంది. అన్న వదినలైన నాగేంద్ర, దివ్య తన తల్లిని హత్య చేశారని సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో సంఘటన జరిగితే అప్పటి నుంచి సోమవారం సాయంత్రం వరకు మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉంచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is suspected that the extra marital relation has lead to the death of a woman in East Godavari district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి