ట్విస్ట్: భర్త అక్రమ సంబంధానికి భార్య సహా ముగ్గురు బలి

విజయనగరం: తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన వివాహిత పల్ల నారాయణమ్మ (25), తన ఇద్దరు పిల్లలు తనూశ్రీ (3), చరణ్‌తేజ (1)ను నేల బావిలోకి తోసి తాను కూడా అదేబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

విజయనగరం జిల్లా పినవేమలి గ్రామానికి చెందిన పల్ల నారాయణమ్మకు విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలసకు చెందిన పల్ల శ్రీనుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. తగరపువలసలో ఆప్టికల్స్ దుకాణం నడుపుతున్న శ్రీనుకి అక్కడే ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం విషయాన్ని భర్త శ్రీనుని నారాయణమ్మ నిలదీసింది.

దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీను తన భార్య నారాయణమ్మను హెచ్చరించాడు. ఎక్కువ మాట్లాడితే తన ప్రియురాలిని ఇంటికి తీసుకుని వస్తానని చెప్పి ఈ నెల 4న నారాయణమ్మ నుంచి నగలు తీసుకుని పినవేమలి గ్రామంలోఆమెను కన్నవారింట్లో వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణమ్మ అదేరోజు తనకి అనారోగ్యంగా ఉందని, రాకోడు పిహెచ్‌సికి వెళ్తానని తల్లికి చెప్పి వెళ్ళింది.

Extra marital relation takes three lives

ఎంతసేపటికీ నారాయణమ్మ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అగ్గిరాముడు, సింహాచలం గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం తల్లి సింహాచలానికి గ్రామ సమీపంలో గల ఓ నేల బావిలో కుమార్తె నారాయణమ్మ, మనుమలు తనూశ్రీ, చరణ్‌తేజ మృతదేహాలు కనిపించాయి.

దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఆమె అక్కడే కుప్పకూలింది. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతరమయ్యారు. మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రూరల్ సిఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+