బాబు నాకు కజిన్.., లోకేష్ చాలా క్లోజ్: ఈ మాటలతోనే 'నర్రా' ముంచేశాడు?
సీఎం తనకు కజిన్ అవుతారని, లోకేష్ బాగా క్లోజ్ అని చెబుతూ చాలామందిని నర్రా బుట్టలో వేసుకున్నాడు.
విజయవాడ: ఫేక్ ఇండస్ట్రియలిస్ట్ నర్రా కృష్ణారావు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ పేర్లను సైతం ఉపయోగించుకుని అతను మోసాలకు పాల్పడిన తీరు విస్మయపరుస్తోంది.
సీఎం తనకు కజిన్ అవుతారని, లోకేష్ బాగా క్లోజ్ అని చెబుతూ చాలామందిని నర్రా బుట్టలో వేసుకున్నాడు. అంతేకాదు, టీడీపీ ఆర్థిక విభాగం అధ్యక్షుడినని, రేపో మాపో రాజ్యసభకు కూడా వెళ్తానని నమ్మించేవాడు. అప్పట్లో సీఎం పాదయాత్రకు అంతా తానే దగ్గరుండి చూసుకున్నానని చెప్పేవాడు.

ఇలాంటి మాటలతో బడాబాబులను నమ్మించి వారి వద్ద నుంచి పెట్టుబడి కోసం తీసుకున్న డబ్బుతో ఉడాయించాడు. అంతేనా.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులకు టోకరా వేశాడు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న నర్రా, అతని భార్య నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications