ఎంపీని బెదిరించి రూ.10 కోట్లు, కత్తితో దాడి చేసి రూ.70 వేలు

ఒక ఈమెయిల్... ఆ తర్వాత వరుస ఫోన్ కాల్స్... చివరకు కత్తితో బెదిరింపులు, డబ్బుల దోపిడీ! ఏపీకి చెందిన ఓ ఎంపీని, ఓ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని సాగిన బ్లాక్‌మైలింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఆర్టీఐ కార్యకర్తనని చెప్పుకుంటూ రాజకీయ నేతలను వణికించిన నిందితుడి కథ చివరకు పోలీసుల వలలో చిక్కింది.

ముంబయికి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కే అనే వ్యక్తి, ఏపీలోని ఓ ఎంపీకి ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపడం ప్రారంభించాడు. ఎన్నికల సమయంలో సమర్పించిన ఆస్తుల వివరాలను ఆధారంగా చేసుకుని, "మీ ఆస్తుల చిట్టా మొత్తం బయటపెడతా... కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపిస్తా" అంటూ భయపెట్టాడు. తనకు రూ.10 కోట్లు చెల్లిస్తే వ్యవహారాన్ని ఇక్కడితో ముగిస్తానని, లేదంటే రాజకీయ జీవితాన్నే కుదిపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు.

Fake RTI Activist Arrested for Blackmailing MP and MLA with Rs 10 Crore Extortion Threats

వరుస బెదిరింపులతో పరిస్థితి తీవ్రమవుతుండటంతో పీఏను రంగంలోకి దించారు సదరు నేత. చెప్పిన ప్లేస్ కు వచ్చిన రుషాంత్ పీఏపైన కూడా కత్తితో ఆటాక్ చేయబోయాడు. అంతటితో ఆగకుండా రూ.70 వేలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక లాభం లేదు అనుకున్న ఆ ఎంపీ పోలీసులను రంగంలోకి దింపడంతో కథ పూర్తిగా కంచికి చేరింది.

ఇంతకూ రిషాంత్ టార్గెట్ చేసిన నేత ఎవరంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. రుషాంత్.. తనను పట్టుకోవడానికి పీఏను పంపిన ఇద్దరు నేతలకు ఝలక్ ఇచ్చాడు. ఇక లాభంలేదనుకున్న ఈ తండ్రికొడుకులు పోలీసులకు సమాచారం అందిచారు.

ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, ఈ-మెయిల్ ట్రేసింగ్ ద్వారా నిందితుడు దక్షిణ ముంబయిలో ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో అతడిని అరెస్టు చేసి కడపకు తరలించారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు.

దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చెప్పుకున్నట్లు ఆర్టీఐ కార్యకర్త కాదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆస్తుల వివరాలను ఆధారంగా చేసుకుని బ్లాక్‌మైలింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర కూడా ఉన్నట్లు సంకేతాలు లభించడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ బ్లాక్‌మైలింగ్ డ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+