యాంకర్ శ్యామలపై మొదలైన మెగా దాడి....? మరీ ఇంతలా దిగజారుతారా అంటూ ఫైర్

ఏపీ రాజకీయాల్లో యాంకర్ శ్యామల హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కల్యాణ్ జనసేన , టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకుండా చేస్తారనే టాక్ ఉంది. అలీ, పోసాని వంటి గొప్ప పేరున్న నటులకు సైతం ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

అయినప్పటికి కూడా యాంకర్ శ్యామల వైసీపీకి అండగా నిలిచారు. అయితే ఆమె వైసీపీకి సపోర్టు చేసిన దగ్గర నుంచి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ, జనసేనకు సంబంధించిన కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు. శ్యామల చీకటి భగోతాలు ఎవరికి తెలియవంటూ ఉండవల్లి అనూష, నటుడు పృథ్వీ వంటి వారు ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ముందే ఊహించి వైసీపీకి మద్దతుగా నిలిచానని శ్యామల ఓ ఇంటర్య్వూలో తెలపడం జరిగింది.

False propaganda on social media against anchor shyamala

ఇదే ఇంటర్య్వూలో ఆమె ముసలి నక్క, తోడేలు గురించి చెప్పిన కథ సూటికి ఎవరికి తగలాలో వారికే తగలడంతో ఓ వర్గం శ్యామలపై మండిపడుతోంది. ఎన్నికలు ముగిశాయి. నేతల జాతకాలు మరో రెండు వారాల్లో తేలిపోయినున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి శ్యామలను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ పార్టీలో సినీ , రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం. హీరో శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే తాము ఆ పార్టీలో లేమని ఈ ముగ్గురు ప్రకటించారు. అయితే సడన్‌గా ఓ వర్గం మీడియాలో రేవ్ పార్టీలో పట్టుపడ్డ ప్రముఖ యాంకర్ అంటూ వార్తలు వెలిశాయి.

మంత్రి కాకాణి ఎమ్మెల్యే స్టికర్ ఉన్న కారు రేవ్ పార్టీలో ఉండటంతో ఆ కారులో ప్రముఖ యాంకర్ కూడా ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. పరొక్షంగా శ్యామలను ఉద్దేశించే ఈ కథనాలు వెలువడ్డాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. రాబోవు రోజులు ఇలాంటి ప్రచారం ఉదృతం అయిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే యాంకర్ శ్యామలకు వైసీపీ క్యాడర్ అండగా నిలుస్తోంది. ఓ ఆడపిల్లపై ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. శ్యామలపై కావాలనే బురద జల్లుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఓ వర్గం శ్యామలపై కావాలనే ఈ విధంగా కుట్ర చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. . అయితే దీనిపై శ్యామల అచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాతే ఆమె ఈ ఘటనపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+