ఎన్ టీఆర్ రూ. 100 నాణెం, క్రిడిట్ మొత్తం ఎవరి ఖాతాలో పడిందంటే ?, స్కెచ్ మాత్రం!

హైదరాబాద్/విజయవాడ: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు అభిమానులకు ఈ రోజు మరుపురాని రోజు. తెలుగువాడి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానటుడు, రాజకీయ నాయకుడు సీనియర్ ఎన్ టీఆర్. అలాంటి మహానుభావుడి గుర్తుగా ముద్రించిన రూ. 100 నాణేన్ని ఈ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

ఏ పాత్ర అయినా అవలీలగా పోషించే నటుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు నందమూరి తారక రామారావు. రాముడు అయినా, రావణుడు అయినా, భీముడు అయినా ధుర్యోదనుడు అయినా, క్రిష్ణుడు అయినా పాతళభైరవిలో తోటరాముడు అయినా ఇలా ఎలాంటి పాత్రలో అయినా జీవించిపోయే వ్యక్తిగా సీనియర్ ఎన్ టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు.

NTR Commemorative coin

హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా ఎన్ టీఆర్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి మహానుభావుడు ఎన్ టీర్ శతజయంతి వేడుకల సందర్బంగా రూ. 100 నాణెం విడుదల అయ్యింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి, ఎన్ టీఆర్ కుమార్ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణమరాజు తదితరులు పాల్గొన్నారు.

NTR Commemorative coin

అయితే నందమూరి తారక రామారావు గుర్తుగా రూ. 100 నాణేన్ని ముద్రించి విడుదల చేయించడంలో పూర్తి క్రిడిట్ ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి దక్కిందని ప్రజలు అంటున్నారు. ఎన్ టీఆర్ చనిపోయిన తరువాత ఆయనకు భారతరత్న ఇప్పించడంతో టీడీపీ నాయకులు పూర్తిగా విఫలం అయ్యారని, ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆలాంటి ప్రయత్నాలు ఏమాత్రం చెయ్యలేదని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చలు జరిపి ఎన్ టీర్ శతజంతి వేడులక సందర్బంగా ఆయన ఫోటోతో రూ. 100 నాణేన్ని ముద్రించి విడుదల చేయించే విషయంలో ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఇంతకాలం అనేక ప్రయత్నాలు చేశారని, అందుకు ఫలితంగానే ఈ రోజు ఎన్ టీఆర్ రూ. 100 నాణెం విడుదల అయ్యిందని కొందరు నాయకులు అంటున్నారు.

NTR Commemorative coin

ఎన్ టీఆర్ కుమారులు, నారా చంద్రబాబు నాయుడు కూడా చెయ్యని ప్రయత్నాలు ఎన్ టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరిపి ఎన్ టీఆర్ కు గుర్తుగా రూ. 100 నాణేన్ని విడుదల చేసే విషయంలో దగ్గుబాటి పురందేశ్వరి చాలా శ్రమించారని స్వయంగా సీనియర్ ఎన్ టీఆర్ అభిమానులు అంటున్నారు. మొత్తం మీద ఎన్ టీఆర్ రూ. 100 నాణేన్ని విడుదల చేయించిన పూర్తి క్రెడిట్ దగ్గుబాటి పురందేశ్వరికి చెందుతుందని నందమూరి అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+