జగన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా- ఆశ్చర్యకరంగా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి దాదాపుగా అన్ని విషయాలూ మనకు తెలిసినవే. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నందున కుటుంబ నేపథ్యం, చదువు, ఆయనకు ఉన్న సొంత ప్రైవేట్ సంస్థలు, ఆస్తిపాస్తుల గురించి ఓ అంచనా అనేది అందరిలోనూ ఉంటుంది.

ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. వైఎస్ఆర్సీపీని స్థాపించిన పరిస్థితులు, అందుకు దారి తీసిన సంఘటనలు, 2014 నాటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఆ తరువాత 2019లో రికార్డుస్థాయిలో 151 అసెంబ్లీ స్థానాలతో ఘన విజయం సాధించడం తెలిసిందే.

Farewell to a Legend YS Jagan Honors Cheteshwar Pujara on His Retirement

అదే వైఎస్ జగన్ లో ఓ కొత్తకోణం గురించి తెలిసిన వాళ్లు తక్కువే ఉండొచ్చు. అదే- క్రికెట్. స్పోర్ట్స్ అన్నా.. అందులోనూ క్రికెట్ అన్నా ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జగన్ తన హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామీణ స్థాయిలో మట్టిలో ఉన్న క్రీడా మాణిక్యాలను వెలికి తీయడానికి ప్రయత్నించారు.

ఇప్పుడు- తాజాగా ఆయన అభిమాన క్రికెటర్ ఎవరో కూడా వెల్లడైంది. అతను- చేతేశ్వర్ పుజారా. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించిన ఈ స్టార్ బ్యాటర్ కు జగన్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆయన భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని, అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, దూరదృష్టి దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచీ వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారి సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీనికి గల కారణాలను వివరిస్తూ ఓ సుదీర్ఘ లేఖ రాశాడు.

టీమిండియా జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం మాటల్లో చెప్పలేని అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొన్నాడు. చాలా కాలంగా భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కట్లేదు. బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది.

Farewell to a Legend YS Jagan Honors Cheteshwar Pujara on His Retirement

చివరిసారిగా 2023లో కెన్నింగ్‌టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు పుజారా. ఆ తరువాత జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్ లో భారీగా పరుగులు చేసినప్పటికీ- బీసీసీఐ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అతనికి జట్టు మళ్లీ అవకాశాలను కల్పించలేదు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ జట్టులోకి పుజారా తిరిగి వస్తాడని ఊహాగానాలు చెలరేగాయి. సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు మొగ్గు చూపారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత,- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫార్మాట్ నుండి తప్పుకొన్నారు.

ఈ పరిస్థితుల మధ్య జాతీయ జట్టులోకి పునరాగమనం అసాధ్యమని భావించిన నేపథ్యంలో చేతేశ్వర్ పుజారా.. రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అన్నింటికీ ముగింపు ఉంటుందని, తన కేరీర్ ను ముగిస్తోన్నానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+