రైతు ఆత్మహత్య: కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని సూసైడ్ నోట్?
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ పత్తి రైతు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తన సూసైడ్ నోట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరును రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లాలోని కొణిజెర్లకు చెందిన రైతు వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన చావుకు కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన సూసైడ్ నోట్లో రాసినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ యంత్రాంగం రుణమాఫీ చేయకపోవడంతో.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారని తెలుస్తోంది. అతను మూడు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. మృతదేహంతో బంధువులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మెట్రో అలైన్‌మెంట్ మార్చండి: ఏబీవీపీ

మెట్రోఅలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు బుధవారం ధర్నా చేపట్టారు. కోఠీలోని ఉమెన్స్ కాలేజీ దగ్గర చేపట్టిన ఈ ధర్నా వల్ల అటువైపుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ మార్గంలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
భాగ్యనగరాన్ని మెట్రోనగరంగా మార్చడానికి చేపట్టిన మెట్రోప్రాజెక్టు కోఠీ ఉమెన్స్ కాలేజీ మీదుగా వెళుతుంది. అయితే ఈ అలైన్‌మెంట్‌ను మార్చాలని విద్యార్థి సంఘాలు, ఏబీవీపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థి నాయకులతో చర్చించారు. అనంతరం విద్యార్థులు ధర్నాను ఉపసంహరించుకున్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా, హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు మున్సిపల్ ఉన్నతాధికారులు గురువారం తెలిపారు.
దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి వెళ్లే వాహనాలను ముసారాంబాగ్ దగ్గర, అదే విధంగా ఎంజీబీఎస్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలను చాదర్‌ఘాట్ దగ్గర మళ్లించే అవకాశం ఉంది. చాదర్‌ఘాట్ నుంచి నింబోలీ అడ్డా, అంబర్‌పేట మీదుగా మళ్లించాలని, మున్సిపల్ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications