Vijayawada: తండ్రితో పాటు కుమార్తెను బలిగొన్న కరెంట్ షాక్.. అనాథులుగా మారిన చిన్నారులు..!
విజయవాడలో కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. విధి ఆడే వింత నాటకంలో మనం పాత్తదారులం మాత్రమే. తాజాగాభర్తతో దూరంగా ఉంటున్న కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు, భార్యను అన్ని తానై చూసుకుంటున్న ఓ పెద్దాయన కరెంట్ షాక్ తో చనిపోయాడు. తండ్రిని రక్షించే క్రమంలో కూతురు కూడా కరెంట్ షాక్ కు బలైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, వృద్ధురాలు అనాథులుగా మారారు.
ఈ విషాదకర ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో గురువారం రాత్రి జరిగింది. సంహాచలం అనే పెద్దాయన రామకోటి మైదానం పాపిట్లవారివీధిలో భార్య వరాలమ్మ, కుమార్తె మంగమ్మ, మనవలతో కలిసి జీవిస్తున్నారు. కూతురు భర్త గొడవపడి తన ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. పిల్లలు స్థానికంగా ఉండే పాఠశాలలో చదువుకుంటున్నారు.

సింహాచలం కూలి పనులు చేసుకుంటే కుటుంబాన్ని పోషించేవాడు. కానీ వయస్సు మీద పడడంతో ఈ మధ్యే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతను పనులకు వెళ్లడం మానేశాడు. ఆ తర్వాత కుటుంబ గడవడం ఇబ్బందిగా మారడంతో వరాలమ్మ, గంగమ్మ ఇళ్ల పనులకు వెళ్లేవారు. సాయంత్ర ఫుడ్ కోర్టుల వద్ద పనులు చేసుకునే వారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం
సింహాచలం స్థానం చేయాలనుకున్నాడు.
ప్లాస్టిక్ బాకెట్ లో నీళ్లు తీసుకొచ్చాడు. హీటర్ పెట్టి స్విచ్ వేయగానే అతనికి కరెంట్ షాక్ కొట్టింది. అక్కడే ఉన్న మంగమ్మ తండ్రిని కాపాడే ప్రయత్నంలో అతడి పట్టుకోవడంతో ఆమెకు కూడా షాక్ తగిలింది. దీంతో తండ్రితో పాటు కూతురు కూడా కరెంట్ షాక్ కు బలైపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications