అనుమానంతో పసిబిడ్డని పాతిపెట్టాడు....కన్నతండ్రే కాలయముడిగా మారిన వైనం
భార్యపై అనుమానంతో కన్నబిడ్డను కిరాతకంగా హతమార్చి ఇంటి ముందే పాతిపెట్టిన ఓ కసాయి తండ్రి ఉదంతమిది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి భార్యపై అనుమానంతో 28 రోజుల వయస్సున్న పసి
ప్రకాశం జిల్లా: భార్యపై అనుమానంతో కన్న బిడ్డ పాలిట కాలయముడిగా మారాడో తండ్రి...పసిబిడ్డ తనకు పట్టలేదంటూ కుటుంబ సభ్యుల ముందే మూడో కుమార్తెని ముక్కు మూసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి పక్కనే అప్పటికప్పుడే గుంట తీసి పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా పెద్దారవీడులో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మాలపాటి సత్యనారాయణరెడ్డి వ్యవసాయ కూలీ. ఇతడు 8 ఏళ్ల క్రితం శ్రీదేవి ని వివాహ చేసుకున్నాడు. వీరికి కుమార్తె దివ్యశ్రీ(7) ,కుమారుడు జశ్వంత్‌రెడ్డి(2) సంతానం కాగా 28 రోజుల కిందట శ్రీదేవి మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఏడాది కాలంగా సత్యనారాయణ రెడ్డి భార్యపై అనుమానంతో ఆమెని వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి భార్యతో మరోసారి గొడవ పడిన సత్యనారాయణరెడ్డి ఆవేశంతో తల్లి పక్కలో నుంచి పసిబిడ్డను లాక్కున్నాడు. కుటుంబ సభ్యులు అడ్డుకోబోయినా ఆగని సత్యనారాయణ రెడ్డి వారు చూస్తుండగానే పసిబిడ్డ ముక్కు మూసి చంపేశాడు. ఆ తరువాత ఇంటి పక్కనే గుంట తీసి ఆ పసిబిడ్డను అందులో పూడ్చిపెట్టాడు. ఊరి జనాలకు అనుమానం రాకుండా ఆ ప్రదేశం పైన రాళ్ల గుట్ట పేర్చాడు. అయితే ఆనోటా ఈనోటా ఈ విషయం గ్రామమంతా పాకడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సత్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టుంకు తరలించారు. పసిబిడ్డను చంపే క్రమంలో పెద్ద కుమార్తె దివ్యశ్రీ తండ్రిని నాన్నా చెల్లిని చంపవద్దని ఎంత ప్రాధేయపడినా కరుణించలేదని బిడ్డ తల్లి శ్రీదేవి సత్యనారాయణరెడ్డి గుండె కరగలేదని భార్య శ్రీదేవి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులకు కంటతడి తెప్పించింది.












Click it and Unblock the Notifications