హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాటు కాటుకు తండ్రీకూతుళ్ల మృతి, గొంతు కోసి వ్యక్తి దారుణ హత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో విషాద సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి మామిడితోటలో నిద్రిస్తున్న తండ్రి, ఇద్దరు కూతుళ్లు పాముకాటుకి గురయ్యారు. ఈ సంఘటనలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. మృతులు తిమ్మప్ప(38), పల్లవి(7), అంజలి(5)గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం గురువాంలో చిట్టిబాబు(26) అనే యువకుడు కరెంట్‌షాక్‌తో ఆదివారం ఉదయం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్నారు.

 father and his two daughters died with snake bite

అప్పుల బాధతో కూతుళ్లను చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం ఏసులాపురంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో రమేశ్ అనే వ్యక్తి(37) తన ఇద్దరు కుమార్తెలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి పిల్లలు శృతి(6), షణ్ముగప్రియ(4)కు తాగించాడు. వాళ్ల చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యక్తి దారుణ హత్య
ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన ఆదివారం జిల్లా కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కొండాపూర్ గ్రామానికి చెందిన మలయాల రాములు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం ఉదయం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్తుండగా దారి కాసిన కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కాగా మృతుడు గతంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
father and his two daughters died with snake bite in Karnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X