ఆడపిల్లల్ని కన్నందుకు ఇన్ని అవమానాలా?: తనతో కాపురం చేయమన్న మామ..

గుంటూరు: నూరేళ్లు సాగాల్సిన ఆలు-మగల అనుబంధం.. మధ్యలోనే కకావికలం అవుతోంది. అదనపు కట్నం కావాలని, మగ పిల్లవాడినే కనాలని మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. లేనిపక్షంలో వారిపై లైంగిక దాడులు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి వేధింపులతోనే రోడ్డున పడ్డ ఇద్దరు మహిళలు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు.

న్యాయం చేయమన్న నన్నపనేని రేఖ..:

న్యాయం చేయమన్న నన్నపనేని రేఖ..:

గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన నన్నపనేని రేఖకి అదే గ్రామానికి చెందిన నాగశ్రావణ్‌కుమార్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదటి కాన్పులో ఆమెకు ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి.

రెండోసారి మళ్లీ ఆడబిడ్డే పుట్టడంతో వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. పైగా అందంగా లేవని భర్త ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. గత వారం రోజులుగా ఆమెకు, పసిపిల్లలకు తిండి పెట్టకుండా నరకం చూపిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఎలిజబేత్ రాణి.. ఈమెది అదే పరిస్థితి:

ఎలిజబేత్ రాణి.. ఈమెది అదే పరిస్థితి:

ఎలిజబెత్ రాణి అనే మరో వివాహితది కూడా అదే సమస్య. 11ఏళ్ల క్రితం గుంటూరు రెడ్డిపాలెంకు చెందిన వెంకటేశ్వరరావుతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలను కన్నదన్న కారణంతో భర్త ఆమెను వదిలేశాడు.

నాలుగేళ్లుగా తనకు ఏ ఆదరణ లేకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాగా చూసుకుంటానని నమ్మించి కేసు కొట్టివేయించాడు. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. భర్త చిత్రహింసలు తాళలేక ఆమె పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడింది.

మరో వివాహితది అదే సమస్య

మరో వివాహితది అదే సమస్య

చుండూరు మండలం చినగాదెలవర్రు గ్రామానికి చెందిన ఓ వివాహితది కూడా ఇలాంటి సమస్యే. రవికుమార్ అనే వ్యక్తితో తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఆమెకు వేధింపులు పెరిగిపోయాయి. ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో అదనపు కట్నం కావాలన్నారు.

తనతో కాపురం చేయాలన్న మామ:

తనతో కాపురం చేయాలన్న మామ:

తమ తల్లిదండ్రులకు అంత స్తోమత లేదని అత్త, మామలతో ఆమె చెప్పింది. అయినా వారు వినిపించుకోలేదు. పైగా.. ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు.

తన కొడుకుతో కాపురం చేస్తే మగపిల్లలు పుట్టలేదు కనుక.. తనతో కానీ తన కుమారులతో కానీ కాపురం చేసి మగపిల్లలను కనాలని మామ ఆమెను వేధించాడు. అందుకు అంగీకరించకపోతే.. తన కొడుకుకు మరో పెళ్లి చేస్తానని బెదిరించాడు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+