న్యూ ఇయర్ వేళ నంద్యాలలో దారుణం.. కన్న కనికరం లేకుండానే !
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను విషమిచ్చి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో కుటుంబం పూర్తిగా ఛిద్రమవ్వడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తంగా క్షణికావేశంలో, మానసిక ఒత్తిడితో మనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు అనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది.
అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేలో కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారాడు. వేములపాటి సురేంద్ర (34) మానసిక ఒత్తిడితో దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.

ఈ దారుణ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను సిగిన్నారుకు కావ్య (7 సంవత్సరాలు), ధ్యానేశ్వరి (4 సంవత్సరాలు), సూర్య గగన్ (2 సంవత్సరాలు).. అత్యంత చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు మరణించడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. పిల్లల భవిష్యత్తు, కలలు ఇలా ఒక్కసారిగా చిద్రమవ్వడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా పిల్లల తల్లి సుమారు 8 నెలల క్రితమే అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించారు.
అప్పటి నుంచి సురేంద్ర ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సరైన మానసిక సహాయం లేకపోవడం ఈ విషాదానికి దారి తీసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని తెలిపారు.
గ్రామంలో విషాద వాతావరణం..
ఈ ఘటనతో తొడుములదీన్నే గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చిన్నారుల మరణం ప్రతి ఇంటినీ కలచివేసిందని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం ఎంతో కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications