కెసిఆర్‌కు ఎమ్మెల్యేల భయం: శ్రవణ్, పదవులపై జెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ గురువారం నిప్పులు చెరిగారు. తెలంగాణ అపాయింటెడ్ తేదీ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అనే భయం కెసిఆర్‌ను పట్టుకుందన్నారు.
అందుకే అపాయింటెడ్ తేదీ పైన రాద్దాంతం చేస్తోందన్నారు. తెరాస వికృత రాజకీయాలు చేస్తోందన్నారు. దళితులు ముఖ్యమంత్రి పదవికి అనుర్హులు అనేలా తెరాస తీరు ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి మైండ్ గేమ్ ఆడుతోందని శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు.

అన్ని రాష్ట్రాలకు పాకింది: జెపి
ఓట్ల కొనుగోలు అన్ని రాష్ట్రాలకు పాకిందని లోకసత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ గురువారం అన్నారు. రాజకీయ పదవులను నాయకులు జీవన్మరణ సమస్యగా మార్చేశాయన్నారు. పదవుల కోసం ఉన్మాద దశకు చేరుకున్నారని మండిపడ్డారు. అందుకోసం రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టాయన్నారు.
ఎన్నికల్లో దాదాపు పార్టీలు రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టాయని ఆరోపించారు. జిల్లా పరిషత్ సభ్యత్వం కోసం రూ.7 కోట్ల ఖర్చు పెడుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అటు ఉద్యోగులు పోలింగులో ప్రభుత్వ విధులనే విస్మరించారని, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 12వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications