డ్రైవర్లు, సిబ్బంది మధ్య ఘర్షణ... నిలిచిన బస్సులు
విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిపోలో భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, బస్సు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే... డ్రైవర్లు మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపించగా, అలాంటిదేమీ లేదని డ్రైవర్లు వాదించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ముదిరి ఘర్షణకు దారి తీసింది.

అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వైఖరికి నిరసనగా డ్రైవర్లు, కండెక్టర్లతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. మందుస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగడంతో బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications