జనసేన నాయకులకు ఘోర అవమానం..చొక్కాలు పట్టుకుని మరీ కిందకు లాగిన టీడీపీ నేతలు
కూటమిలో కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి నేతల మధ్య అధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా, నేతల మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలకు అడుగడునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే 21 సీట్లకే పరిమితం అయ్యామనే అసంతృప్తితో జనసేన నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు. అయినా పవన్ కల్యాణ్ గెలుపు కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు టీడీపీ నేతల దగ్గర అవమానాలే ఎదురవుతున్నాయి.
ఇటీవలే దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇష్టం అయితే మాతో ప్రచారం చేయండి. మీరు మీరు గొడవపడే కింద అయితే మీ ఇద్దరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని... ఈ విధంగా మాతో పని చేయక్కర్లేదని చింతమనేని వ్యాఖ్యానించారు.మీ పార్టీలో ఏదైన సమస్య ఉంటే జనసేన జిల్లా అధ్యక్షుడు దగ్గర తేల్చుకోవాలని చింతమనేని హితవు పలికారు. మీరు మీరు గొడవపడే లెక్కన అయితే నా ప్రచారానికి మీరు రావద్దంటూ చింతమనేని తేల్చి చెప్పారు.

ఇది మరువక ముందే ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలకు ఘోర అవమానం ఎదురైంది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. గల్లాలు పట్టి కిందకు లాగేశారు టీడీపీ నేతలు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ శ్రేణులు ప్రశ్నించాయి.
దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, జనసేన నేతలను, ఆపార్టీ జెండాలు పట్టుకుని ప్రచార రథం ఎక్కిన వారిని బలవంతంగా దించేశారు. ప్రచార రథం దిగిపోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కష్టాల్లో అండగా ఉన్న తమను ఇది పిలిచి అవమానించడమే అని జనసేన నాయకులు భావిస్తున్నారు. తమ మద్దతు లేకుండా భీమిలిలో టీడీపీ ఎలా గెలుస్తుందో అంటూ జనసేన నాయకులు సవాల్ విసురుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications