యనమల దృష్టి మొత్తం అటే - వెనుకడుగు లేదు: మంత్రి బుగ్గన..!!

టీడీపీ సీనియర్ నేత యనమల పైన మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేసారు. యనమల తమ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఏపీలో జగన్ పాలన పై యనమల దుమ్మెత్తి పోయడం చూస్తే.. పిల్లి శాపాలు.. అనే సామెత గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా యావత్‌ రైతాంగం పచ్చగా ఉంటే యనమల ఓర్వ లేక పోతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అంది వారి అవసరాలు తీరుతుంటే అది చూసి ఓర్వ లేక యనమల, ఇతర టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

టీడీపీ నేతలు అదే పనిగా

టీడీపీ నేతలు అదే పనిగా

కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని గుర్తు చేసారు. ఇపుడేమో... నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల దృష్టి మొత్తం ప్రపంచంలో ఎక్కడ అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయో అక్కడే ఉంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేసారు.

ఏఏ దేశాల్లో పరిస్థితులు బాగ లేవో మరీ వెతికి పట్టుకుని అలాంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వస్తాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తూనే... మరో వైపు అభివృద్ధి వైపు మేము దృష్టి సారిస్తూ ఉంటే... శాపనార్థాలు పెట్టడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.

వెనుకడుగు వేయలేదు

వెనుకడుగు వేయలేదు

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ 8 వేల కోట్లు తగ్గిందన్నారు. కరోనా సమయంలో మహామ్మారి కట్టడికి, కోవిద్ వైద్యానికి, టెస్టింగ్ కి, కోవిద్ కేర్ సెంటర్ లు నిర్వహించడం, ఉచిత బియ్యం సరఫరా అదనంగా రూ 7,130 కోట్లు వ్యయం చేసిందని వివరించారు. అయినా, నవరత్నాలు అమలు చేయడం లో ఎక్కడ వెనకడుగు వేయలేదని మంత్రి చెప్పుకొచ్చారు. ఓ వైపు ఆదాయవనరులు పడిపోతున్నా... ఏ మాత్రం జంకకుండా సాహసంతో డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమ చేసి వారిని ఆదుకున్నామని మంత్రి లెక్కలు చెప్పారు.

అప్పుల లెక్కలు ఇలా

అప్పుల లెక్కలు ఇలా

ఇంత మొత్తంలో ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమ చేసిన సందర్భం ఎక్కడా కోవిడ్‌ సమయంలో లేనే లేదని వివరించారు. ఐదేళ్ళ టీడీపీ హయాం లో (2014-19) చేసిన అప్పులు 19.6% పెరిగితే, వైస్సార్సీపీ హయాం లో (2019-22) మూడు సంవత్సరాలలో, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులు తో కలుపుకొని చేసిన అప్పులు 15.5% మాత్రమే పెరిగాయని మంత్రి చెప్పారు.

ఐదేళ్ళ టీడీపీ పాలనలో అమలు చేసిన ఆర్ధిక విధానాలతో పోలిస్తే తమ ప్రభుత్వములో ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి. ఎన్ని ఇబ్బందులున్నా వీటిని సమన్వయం చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి బుగ్గన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+